BJP: కాశీకి క్యూ కట్టిన కాషాయదళం.. మోదీ తరపున ప్రచారానికి తెలంగాణ నేతలు..

దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న ఏడో విడత పోలింగ్ అతిపెద్ద ఓట్ల పండుగ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. తెలంగాణ లోక్ సభలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు, ఎమ్మెల్సీ బై పోల్ కూడా నేటితో పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల మిగిలిన చివరి విడత పోలింగ్ ప్రచారానికి టీ బీజేపీ నేతలు సైతం సై అంటున్నారు.

BJP: కాశీకి క్యూ కట్టిన కాషాయదళం.. మోదీ తరపున ప్రచారానికి తెలంగాణ నేతలు..
Pm Modi
Follow us
Vidyasagar Gunti

| Edited By: Srikar T

Updated on: May 27, 2024 | 12:30 PM

దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న ఏడో విడత పోలింగ్ అతిపెద్ద ఓట్ల పండుగ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. తెలంగాణ లోక్ సభలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు, ఎమ్మెల్సీ బై పోల్ కూడా నేటితో పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల మిగిలిన చివరి విడత పోలింగ్ ప్రచారానికి టీ బీజేపీ నేతలు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసికి తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు. కొద్దిమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే.. మిగిలిన నేతలు నాలుగు రోజుల ప్రచారానికి పయనమయ్యారు.

సోమవారం బీజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు. ప్రధాని మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి లోక్ సభ బరిలో దిగారు. ఆయనకు మద్ధతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ నుంచి నేతలు పయనమయ్యారు. ఆరో విడత ఎన్నికల ప్రక్రియ ముగియడంతో చివరి విడత ఎన్నికల ప్రచారం ఇప్పటికే జోరందుకుంది. ఆయా లోక్ సభ స్థానాల్లో అగ్రనేతల ప్రచారాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బీజెఎల్పీ నేత మహేశ్వర రెడ్డి సహా మరికొంతమంది రాష్ట్ర నేతలు వారణాసి చేరుకుంటారు. మోడీకి మద్ధతుగా అక్కడి ఓటర్లను కలవనున్నారు. పదేళ్ల మోడీ పాలనే దేశమంతా బిజెపిని గెలిపిస్తుందని.. వారణాసిలో మోదీ హవాను ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్తున్నామని ఈటల అన్నారు.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ముగిసిన వెంటనే బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వారణాసి వెళ్లి ప్రచారంలో పాల్గొన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వెనక్కి వచ్చినా.. యూపీ నుంచి రాజ్యసభ మెంబర్‎గా ఉన్న లక్ష్మణ్ మళ్లీ వెళ్లి అక్కడే ప్రచారంలో నిమగ్నమయ్యారు. బండి సంజయ్ వారణాసిలో స్థిరపడిన తెలుగువారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ నెల 30 సాయంత్రం 5 గంటలకు వరకు అక్కడ ప్రచారం ముగియనుంది. అప్పటివరకు తెలంగాణ బిజెపి నేతలు స్థానికులతో కలిసి ప్రచారం నిర్వహించునున్నారు. తుది అంకానికి చేరిన సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. స్వామి కార్యం.. స్వకార్యం రెండు కలసి వచ్చినట్లు.. ప్రచారానికి వెళ్లిన నేతలంతా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని బిజెపి విజయంతో పాటు తెలంగాణలో తమ గెలుపును ఖాయం చేయాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..