Moi Virundhu: రెండేళ్ల తరువాత గ్రామాలను ఏకం చేస్తున్న విభిన్న ఆచారం.. వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Tamil Nadu Moi Virundhu: తమిళనాడులో ‘మోయి విరుందు’ అనే భిన్నమైన ఆచారం ఉంది. సుమారు ఐదు వందల కోట్ల రూపాయలకు కేరాఫ్ అడ్రెస్స్ ఈ మోయి విరుందు..
Tamil Nadu Moi Virundhu: తమిళనాడులో ‘మోయి విరుందు’ అనే భిన్నమైన ఆచారం ఉంది. సుమారు ఐదు వందల కోట్ల రూపాయలకు కేరాఫ్ అడ్రెస్స్ ఈ మోయి విరుందు.. రైతులకు, వ్యాపారులకు లక్షలలో వడ్డీ లేని రుణాలు అందిస్తుంది ఈ విరుందు. రెండేళ్ల తరువాత మోయి విరుందు ద్వారా గ్రామాలన్నీ ఒక్కటవుతున్నాయి. చూసే వాళ్ళకి చిన రాయుడు సినిమాలో ఓ సన్నివేశం మాత్రమే. కానీ, డెల్టా ప్రాంత ప్రజలకు మాత్రం కోట్లు రాబట్టే చదివింపుల విందు. కరోనా ఎఫెక్ట్‌తో రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ మొదలైన చదివింపుల ఆచారంపై ప్రత్యేక కథనం మీకోసం..
తమిళనాడులోని డెల్టా ప్రాంతాలలో ముఖ్యమైనది పుదుక్కోట్టై జిల్లా. కావేరీ తీరంలో ఉండడంతో పూర్తిగా వ్యవసాయాన్ని నమ్ముకున్న ఈ జిల్లాలో రైతులు వ్యవసాయం కోసం బ్యాంకులో వడ్డీ లేని రుణాలకు అస్సలు అంగీకరించరు. దీనికి కారణం ఈ జిల్లాలో జరిగే చదివింపుల విందు. ఏటా జులై నెల నుండి అక్టోబర్ లోపు జరిగే ఈ విందులు కరోనా కారణంగా రెండు సంవత్సరాలు జరగలేదు. దీని ప్రభావం రైతులతో పాటు వ్యాపారులపై తీవ్రంగా పడింది. మళ్ళీ రెండు సంవత్సరాల తరువాత ‘మోయి విరుందు’కి జిల్లాలో గ్రామస్థులు అంగీకరించడంతో ఎక్కడిక్కడ సందడి వాతావరణం నెలకొంది.
మోయి విరుందు అంటే ఎవరైనా వ్యసాయానికి, వ్యాపారానికి ఆర్థికంగా నగదు అవసరమైనప్పుడు మోయి విరుందు ఏర్పాటు చేస్తారు. ఈ మోయి విరుందుకి పత్రికలు పంచి, ఊరంతా బ్యానర్లను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలలో చాటింపు వేస్తారు. ఈ మోయి విరుందుకి మంచి మాంసం కూర వండి వచ్చిన వారందరికీ వడ్డిస్తారు. వచ్చిన వారంతా భోజనం చేసి వెళ్ళేటప్పుడు చదివింపులు చదివిస్తారు. ఐదు వందల నుండి యాభై వేలరూపాయిల వరకు చదివిస్తారు. ఈ చదివింపులలో ముఖ్య నిబంధన.. ఎవరెవరు ఎంత రాశారో తిరిగి దానికంటే కొంచెం ఎక్కవగా వాళ్ళ మోయి విరుందు ఏర్పాటు చేసినప్పుడు చదివింపులుగా చదివించాలి.
ఈ చదివింపుల విందులలో సుమారు ఐదు వందలకోట్లవరకు ఈ రెండు నెలల్లోనే గ్రామస్థులు సేకరిస్తారు. చదివింపులు చదివించిన వారికీ రసీదు ఇస్తారు, నగదు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ విందుల కారణంగా వడ్డీ లేని రుణాలుగా వ్యవసాయానికో, వ్యాపారానికో నగదు వారికీ దక్కుతుంది. చిన రాయుడు సినిమాలో మనకి ఒక సన్నివేశం మాత్రమే కానీ ఈ ఆచారం డెల్టా ప్రాంత రైతులకు ఒక గొప్ప వరం. పుదుకోట్టై జిల్లాలో అలాంగుడి ప్రారంభమైన ఈ మోయి విరుందు ఈ రెండు నెలలోనే రైతుల పాలిట వరంగా మారుతుందడంలో ఎటువంటి సందేహం లేదు.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..