AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు.. రోడ్డు సైడ్ రెస్టారెంట్స్ కి అక్రమ రవాణా..!

వెజ్ బిర్యానీ మాత్రమే కాదు చికెన్ బిర్యానీ , మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ వంటి రకరకాల బిర్యానీలు మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. అయితే ఒక జంటకు వింత కోరిక కలిగి నట్లు ఉంది.. కాకుల ను చంపి ఆ మాసంతో ఏకంగా విందుకి రెడీ అవుతున్నారు. కాకి మాంసం అనగానే సునీల్ నటించిన ఓ ఫన్నీ సీన్ గుర్తుకొస్తుంది. ఓ కాకా హోటల్ లో సునీల్ చికెన్ బిర్యానీ తింటాడు. తర్వాత కాకిలా అరవడం మొదలపెడతాడు. ఆ తర్వాత తాను తిండి కోడి బిర్యానీ కాదని కాకి బిర్యానీ అని తెలిసి షాక్ తింటారు. కాకి మాసంతో విందు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని , తిరువళ్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

కాకి బిర్యానీ కోసం 19 కాకులను చంపిన దంపతులు.. రోడ్డు సైడ్ రెస్టారెంట్స్ కి అక్రమ రవాణా..!
Crows For Meat
Surya Kala
|

Updated on: Dec 18, 2024 | 2:29 PM

Share

తమిళనాడులోని తిరువళ్లూరులో ఓ వింత ఘటన వెలుగు చూసింది. తిరువళ్లూరులోని ఓ గ్రామంలో కాకులను చంపి మాసంతో బిర్యానీ చేయడానికి రెడీ అయిన జంటకు అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు జరిమానా కూడా విధించారు. తిరువళ్లూరు జిల్లా నయపాక్కం రిజర్వ్ సమీపంలోని తోరైపాక్కం గ్రామంలో రమేష్, భూచమ్మ అనే దంపతులు కాకులను చంపుతున్నట్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రమేష్ దంపతుల ఇంట్లో సోదాలు చేశారు. ఇంట్లో ఉన్న 19 కాకులు స్వాధీనం చేసుకున్నారు.

అటవీశాఖ అధికారులు దంపతులను విచారించగా.. తమ ఇంట్లో 7 మంది ఉన్నామని చెప్పారు. నలుగురు కుమార్తెలు, 1 కొడుకుతో పాటు తామిద్దరం ఉన్నామని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, రమేష్ ఇంట్లో విందు కోసం ఈ కాకులను పట్టుకున్నాడు. అంతేకాదు రోడ్డు పక్కన అమ్మే మాంసాహార తినుబండారాలు, హైవేలపై ఉన్న చిన్న మాంసాహార రెస్టారెంట్లకు మాంసం సరఫరా చేసేందుకు ఈ కాకులు పట్టుబడినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు.

5,000 జరిమానా విధించిన అధికారులు

మాంసాన్ని తినేందుకు కాకులను చంపడంపై అటవీశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కాకి మాసం తింటే తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడదని దంపతులు చెబుతున్నారు. ఇప్పటికే కాకుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంటే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని అటవీశాఖ అధికారులు తెలిపారు. అటవీ శాఖ పరిరక్షణ చట్టం, 1972 ప్రకారం కాకులు క్రిమికీటకాలుగా పరిగణించబడుతున్నందున అధికారులు దంపతులను అరెస్టు చేయలేదు. అయితే వారిని హెచ్చరించి రూ.5వేలు జరిమానా విధించడంతో పాటు అటవీ ఆక్రమణపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

శాంపిల్స్ పరీక్షకు పంపాలి

ఈ విషయంపై యానిమల్ వెల్ఫేర్ అభయారణ్యం వ్యవస్థాపకుడు సాయి విఘ్నేష్ మాట్లాడుతూ.. పిల్లి మాంసాన్ని స్వాధీనం చేసుకోవాలని గతంలో చాలాసార్లు పోలీసులకు సమాచారం అందించాను. చెన్నై-బెంగళూరు, తిరువళ్లూరు-తిరుపతి రహదారులపై ఆహారంలో మాంసం కల్తీ జరగకుండా ఉండేందుకు ఆహార భద్రత అధికారులు ఎప్పటికప్పుడు పైన పేర్కొన్న రెస్టారెంట్లను తనిఖీ చేయాలి. అలాగే.. అక్కడ ఉన్న మాంసం నమూనాలను సేకరించి పరీక్ష కోసం పంపాలని సూచిస్తున్నారు. source 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..