Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rains Alert: తమిళనాడులో భారీ వర్షాలు.. జన జీవనం అస్తవ్యస్తం.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు

రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. 5 రాష్ట్రాల్లో వ‌ర్షం ముంచెత్తడంతో స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబ‌త్తూరు, నీల్‌గిరిస్‌, దిండిగల్‌, మధురై ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసి వేయవల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Rains Alert: తమిళనాడులో భారీ వర్షాలు.. జన జీవనం అస్తవ్యస్తం.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు
Tamilnadu Rains
Follow us
Surya Kala

|

Updated on: Nov 10, 2023 | 7:41 AM

దక్షిణభారతంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అటు కేరళకు కూడా ఈ ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి..నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. తూత్తుకుడిలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి..సబ్‌వేలోని వరద నీటిలో ఓ బస్సు చిక్కుకుంది.. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు బస్సులో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో బయటికి తీసుకువచ్చారు.. ఈశాన్య రుతుప‌వ‌నాల ప్రభావం త‌మిళ‌నాడుపై ప‌డింది. త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో నవంబర్ 10 వరకు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు ఉధృతంగా ఉన్నాయి. ఉత్తర తీర ప్రాంతంలో, చుట్టుపక్కల వాతావరణ మాంటిల్ సర్క్యులేషన్ ఉంది. దీని ప్రభావంతో ఉత్తర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అప్పుడప్పుడు మోస్తరు వర్షం కురుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజా జీవరణం అస్తవ్యస్తమవుతోంది. 5 రాష్ట్రాల్లో వ‌ర్షం ముంచెత్తడంతో స్కూల్స్‌, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని కోయంబ‌త్తూరు, నీల్‌గిరిస్‌, దిండిగల్‌, మధురై ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసి వేయవల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు నుంచి క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయని తెల్పింది ఐఎండీ. కాని ఇప్పటికే జరగాల్సిన పంటనష్టం జరిగిపోయింది.

కోయంబత్తూరు, నీల్జియన్, దిండిగల్ , మదురైలో ఆయా జిల్లాల్లో భారీవర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతం తిరుపూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠ‌శాలలు, కాలేజీలకు అధికారులు సెల‌వులు ప్రక‌టించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

ఇక రాబోయే 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చరించారు. గ‌త కొద్ది రోజుల నుంచి కేర‌ళ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌న్నూరు జిల్లాలో 7 సెం.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..