Inspirational Story: 97 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పిన కేరళ న్యాయవాది..
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం న్యాయవాదిగా సుదీర్ఘ కెరీర్ 73 సంవత్సరాల 60 రోజులు కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు పి బాలసుబ్రమణియన్ మీనన్. అయితే ఇప్పటికీ తన జీవితంలో, కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి మీనన్ తన వయసుని సాకుగా ఎప్పుడూ చూపించరు. అంతేకాదు 97 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు.

కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నాడో మహా కవి.. అయితే నేటి తరం యువతీయువకులకు ఆదర్శంగా నిలుస్తూ వయసు ఒక నెంబర్ మాత్రమే తమలో ఆలోచించే చేవ తగ్గలేదు నిరూపిస్తూనే ఉన్నారు ఎందరో వృద్ధులు. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన 97 ఏళ్ల వృద్ధుడు పి. బాలసుబ్రమణియన్ మీనన్ ప్రముఖ న్యాయవాది. తాజాగా పి. బాలసుబ్రమణియన్ సుదీర్ఘకాలం లాయర్ గా కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. ఇదే విషయాన్నీ 11 సెప్టెంబరు 2023న కేరళలో ధృవీకరించారు.
న్యాయవాది పి బాలసుబ్రమణియన్ మీనన్ అత్యధిక కాలం న్యాయవాదిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. లాయర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన సక్సెస్ ఫుల్ గా 73 సంవత్సరాల 60 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్నీ ధృవీకరిస్తూ ఐకానిక్ రికార్డ్ బుక్ బాలసుబ్రమణియన్ మీనన్ ఫీట్‌ను నోట్ చేసి.. సర్టిఫికేట్ మంజూరు చేసింది.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం న్యాయవాదిగా సుదీర్ఘ కెరీర్ 73 సంవత్సరాల 60 రోజులు కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు పి బాలసుబ్రమణియన్ మీనన్. అయితే ఇప్పటికీ తన జీవితంలో, కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి మీనన్ తన వయసుని సాకుగా ఎప్పుడూ చూపించరు. అంతేకాదు 97 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా తన వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పటికీ తాను తీసుకున్న కేసుల నిమిత్తం కోర్టు తేదీలు, తన కస్టమర్స్ తో సమావేశాలతో పాటు ఇతర వృత్తిపరమైన వ్యవహారాల్లో కూడా ప్రతి రోజూ తప్పకుండా హాజరవుతారు. ఎవరైనా తనను నమ్మి కేసు తీసుకోమని వస్తారు. వారి నమ్మకం నిలిబెడుతూ తాను వారి కోసం చేయగలిగినదంతా చేస్తానని మీనన్ చెప్పారు.
ఒక వార్త పత్రిక నివేదిక ప్రకారం మీనన్ పనితీరులో ప్రత్యేకమైన శైలి ఉందని పేర్కొంది. కేసు ను వాదించే సమయంలో మీనన్ ఉపయోగించే పదజాలం, ఆలస్యం చేసే వ్యూహాలు అమోఘం అని ప్రశంసిస్తూ ఉంటారు. మీనన్ కేసుని వాదించే సమయంలో చేసే క్రాస్ ఎగ్జామినేషన్లు ఎల్లప్పుడూ చిన్నవిగా.. పాయింట్‌తో ఉంటాయని పేర్కొంది. కోర్టులో ఎక్కువ సమయం వాదించడంపై తనకు నమ్మకం లేదని మీనన్ చెప్పారు.
మీనన్ పాలక్కాడ్‌లోని సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. 1950ల ప్రారంభంలో లాయర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. 1980లో లేదా 1990ల తర్వాత మీనన్ తన వృత్తికి విరామం ఇచ్చి.. జీవితంలో విశ్రాంతి తీసుకోవాలని.. రిటైర్డ్ జీవితాన్ని గడపాలని చాలామంది ఆశించారు.
అయితే మీనన్ ఎప్పుడూ రిటైర్ కావలని కోరుకోలేదు. తన వృత్తిలో తాను కొనసాగాలనే కోరుకున్నారు. ఎవరైనా ఎప్పుడైనా మీరు ఎప్పుడు రిటైర్ అవ్వాలని అనుకుంటున్నారని అడిగితే నవ్వుతూనే ఉంటారు. ఇదే విషయం గురించి భవిష్యత్ కు ఇప్పుడు అడిగినా తన ఆరోగ్యం సహకరించినంత కాలం తాను తమ కేసులు వాదించాలని తన పార్టీ కోరుకునేటంత కాలం లాయర్ గా తన వృత్తిని కొనసాగిస్తాన అని పి బాలసుబ్రమణియన్ మీనన్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








