Dhanteras 2023: ఈ కుబేరుడి ఆలయంలో ధన్‌తేరాస్ రోజున దరఖాస్తు చేస్తే.. డబ్బులకు కొరత ఉండదని నమ్మకం.
హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు. హరిద్వార్ ఇక్కడ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. గంగనదిలో స్నానం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఉత్తరాఖండ్‌కు భారతదేశ ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ధ్యానం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఉన్న కుబేరు దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో తమ కోరికలను దరఖాస్తు చేస్తే అన్ని పనులు పూర్తి అవుతాయని విశ్వాసం.

ధనత్రయోదశి పండుగను ఈరోజు అనగా శుక్రవారం నవంబర్ 10వ తేదీన జరుపుకుంటున్నారు. పాత్రలు, ఆభరణాలు వంటి అనేక వస్తువులను ధన్‌తేరస్‌లో కొనుగోలు చేస్తారు. దీపావళి పండుగ ధన్ తేరాస్ రోజు నుండి మొదలవుతుంది. ఈ రోజున సంపదకు దేవుడు అయిన కుబేరుని పూజించే సంప్రదాయం ఉంది. ధన్ తేరాస్ రోజున భారతదేశంలోని పురాతన కుబేరుడి ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఉంది.
హిమాచల్ ప్రదేశ్ మాదిరిగానే ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు. హరిద్వార్ ఇక్కడ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. గంగనదిలో స్నానం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఉత్తరాఖండ్‌కు భారతదేశ ప్రజలే కాకుండా విదేశీయులు కూడా ధ్యానం చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ ఉన్న కుబేరు దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయంలో తమ కోరికలను దరఖాస్తు చేస్తే అన్ని పనులు పూర్తి అవుతాయని విశ్వాసం.
ఆలయం ఎక్కడ ఉందంటే
జగేశ్వర్ ధామ్ అనే ఆలయం ఉత్తరాఖండ్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ధామ్‌లో కుబేరు దేవాలయం కూడా ఉంది. ఈ పవిత్ర దేవాలయంలో స్థానికులు ప్రతిరోజూ పూజలు చేస్తారు. ధన్ తేరాస్ నుంచి దీపావళి వరకూ భక్తుల రద్దీ ఉంటుంది. ఇది దేశంలోని ఆరవ కుబేరు దేవాలయం. ఇక్కడ ఏకముఖ శివలింగం రూపంలో కుబేరుడు కొలువై ఉన్నాడు.
ఆలయ చరిత్ర ఏమిటంటే
ఈ కుబేరు దేవాలయం చరిత్ర చాలా ఆసక్తికరమైనది. కుబేర దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడిందని స్థానికుల కథనం. అదే సమయంలో ఈ ఆలయాన్ని 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం మధ్య కట్యూరి రాజవంశం కాలంలో నిర్మించారని మరికొందరు భావిస్తున్నారు.
ఆలయానికి సంబంధించిన నమ్మకం
వ్యాపారం సరిగ్గా జరగని లేదా డబ్బు కొరతను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ ఆలయానికి వెళ్లారు. ఇక్కడ ఆలయంలో తమ కష్టాలను వెల్లడిస్తూ దరఖాస్తు చేసుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన మరొక విశ్వాసం ఏమిటంటే గర్భగుడిలోని మట్టిని ఇక్కడకు తీసుకువెళ్లి ఇంట్లో భద్రంగా దాచుకుంటారు. ఇలా చేయడం వలన తమ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు