Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా.? ఇంట్లో ఈ వాస్తు లోపాలున్నట్లే..
ఎంతో కష్టపడి సంపాదించి, ఖర్చులను తగ్గించి మరీ పొదుపు చేసిన సొమ్ము ఉన్నట్లుండి దేనికో ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో అప్పటి వరకు దాచుకున్న సొమ్ము నీళ్లలా ఖర్చయిపోతుంది. ఇలాంటి పరిస్థితి మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అయితే దీనికి ఇంట్లో ఉండే వాస్తు లోపాలే కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. డబ్బులు చేతిలో నిలవకపోతే...

ప్రతీ మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అందుకోసం ఖర్చులుపోను ఎంతో కొంత సేవింగ్స్ రూపంలో దాచుకుంటుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఎంత డబ్బు సంపాదించినా వృథాగా ఖర్చవుతూనే ఉంటుంది.
ఎంతో కష్టపడి సంపాదించి, ఖర్చులను తగ్గించి మరీ పొదుపు చేసిన సొమ్ము ఉన్నట్లుండి దేనికో ఖర్చవుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో అప్పటి వరకు దాచుకున్న సొమ్ము నీళ్లలా ఖర్చయిపోతుంది. ఇలాంటి పరిస్థితి మనలో చాలా మంది ఎదుర్కొనే ఉంటారు. అయితే దీనికి ఇంట్లో ఉండే వాస్తు లోపాలే కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. డబ్బులు చేతిలో నిలవకపోతే ఇంట్లో కొన్ని వాస్తు లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఆ లోపాలు ఏంటంటే..
* సాధారణంగా డబ్బును దాచి ఉంచడానికి మనలో చాలా మంది అల్మారాలను ఉపయోగిస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు ఉన్న అల్మారా ఏ దిశలోనైనా ఉండొచ్చు, కానీ అల్మారా ముఖం మాత్రం ఎల్లప్పుడూ దక్షిణం వైపు ఉండాలి. ఇలా దక్షిణంవైపు ఉంటే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవచ్చు.
* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కుళాయి నీరు వృథాగా పోతున్న డబ్బు నిలవదని చెబుతున్నారు. కుళా నుంచి నీరు వృథాగా కారడం అశుభానికి సూచికగా చెబుతున్నారు. ఒకవేళ కుళాయి నుంచి నీరు లీకవుతుంటే వెంటనే రిపేర్ చేయించుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
* ఇక ఇంటిలో నీరు పారుదల కూడా వాస్తుపై ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో నీరు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం, పడమర దిశలో నీరు పారితే అది అశుభం. దరిద్రానికి దారి తీస్తుంది. ఇలాంటి దిశలో నీరు పారితే.. ఆ ఇంట్లో డబ్బులు నిలవవు. ఇంట్లో నీరు ఉత్తరం లేదా తూర్పు దిశలో మాత్రమే పారాలని నిపుణులు చెబుతున్నారు.
* వాస్తు శాస్త్రం ప్రకారం పడకగది విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బెడ్ రూమ్‌కు ఎదురుగా ఉన్న గోడలో ఎలాంటి పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇలా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. ఎంత సంపాదించిన వృథా ఖర్చవుతుంది.
* ఇక చాలా మంది ఇంట్లో అవసరం లేని వస్తువులను అలాగే ఉంచుతుంటారు. అయితే ఎక్కువకాలం ఉపయోగంలో లేని వస్తువులు ఇంట్లో ఉంటే మంచిది కాదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి వస్తువుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అనవసరమైన వస్తువులను వెంటనే ఇంట్లో నుంచి బయటపడేయాలని సూచిస్తున్నారు.
* ఇంట్లో డబ్బు నిలవాలన్నా, వృథా ఖర్చులు ఎక్కువగా కాకూడదనుకున్నా ఇంటికి ఉత్తర దిశలో తులసి మొక్కను నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో సంపద పెరుగుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి.
* ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పగిలిన అద్దం ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి పగిలిన అద్దాన్ని వెంటనే తొలగించాలి.
* మనలో చాలా మంది పర్సు విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. ఎన్నేళ్లయినా ఒకే పర్సును ఉపయోగిస్తుంటారు. చివరికి పర్సు చిరిగిపోయినా సరే అలాగే ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలకు దారి తీస్తుంది. కాబట్టి చిరిగిన పర్స్‌ని ఉపయోగించవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..