Watch Video: అమరవీరులకు పూల వర్షం.. రోడ్డుకు ఇరువైపులా నిలబడి నివాళులర్పించిన తమిళ ప్రజలు

Tamil Nadu locals shower flower: హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే..

Watch Video: అమరవీరులకు పూల వర్షం.. రోడ్డుకు ఇరువైపులా నిలబడి నివాళులర్పించిన తమిళ ప్రజలు
Tamil Nadu Locals Shower Fl
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 09, 2021 | 5:38 PM

Bipin Rawat Ambulance Video: హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే.. బిపిన్ రావత్, ఆయన భార్య సహా ఇతర భద్రతా దళాల సిబ్బంది భౌతికకాయాలను తీసుకువెళుతున్న వాహనాలపై తమిళనాడు ప్రజలు పూల వర్షం కురిపించారు. భౌతికకాయాలను నీలగిరి జిల్లాలోని మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ నుంచి సూలూర్ ఎయిర్‌బేస్‌కు అంబులెన్స్‌లలో తరలించారు. ఈ సందర్భంగా స్థానిక తమిళ ప్రజలు రహదారుల పక్కగా బారులు తీరి వీరులకు నివాళులర్పించారు. వాహనాలు వెళుతున్న రోడ్డు మార్గం వెంట ప్రజలు బారులు తీరి అంబులెన్స్‌లపై స్థానికులు పూలు చల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

ఆ తర్వాత భద్రతా దళ సిబ్బంది, పోలీసులు వారి మృతదేహాలను సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి ప్రత్యేక సైనిక విమానంలో ఢిల్లీకి తరలించారు. కాగా.. ఈ హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఇప్పటికే భారత వైమానిక దళం (IAF) విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉండగా బిపిన్ రావత్, ఆయన సతీమణి భౌతికకాయాలకు శుక్రవారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మొత్తం 13 మృతదేహాలను భారత వైమానిక దళం C-130J సూపర్ హెర్క్యులస్ రవాణా విమానంలో న్యూ ఢిల్లీకి తీసుకురానుంది.

అనంతరం ఈరోజు సాయంత్రం పాలం టెక్నికల్ ఏరియాలో జనరల్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాళులర్పించనున్నారు.

Also Read:

Heart Attack: 30 మంది ప్రాణాలు కాపాడి చనిపోయాడు.. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Helicopter Crash: వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. కీలక వివరాలను వెల్లడించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..