Helicopter Crash: వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. కీలక వివరాలను వెల్లడించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..

ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.

Helicopter Crash: వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. కీలక వివరాలను వెల్లడించిన రాజ్‌నాథ్‌ సింగ్‌..
Defence Minister Rajnath Si
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 09, 2021 | 1:01 PM

Defence Minister Rajnath Singh: ఒకే ఒక్కడు..! అవును. కున్నూరు MI చాపర్‌ ప్రమాదంలో ప్రస్తుతం ప్రాణాలతో ఉన్నది ఒకే ఒక్కడు. అతడే గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్. మృత్యువుతో పోరాడుతున్నారు. వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో విశేష సేలందించారు వరుణ్‌ సింగ్‌. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించారు.

ల్యాండింగ్ కోసం తక్కువ ఎత్తుకు విమానం దింపుతుండగా.. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ పూర్తిగా విఫలం అయింది. నియంత్రణ కోల్పోయింది. అప్పుడు ధైర్య సాహసాలు ప్రదర్శించిన వరుణ్‌సింగ్ ఫ్లైట్‌ను చాకచక్యంగా ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా దింపారు.

2020 అక్టోబర్‌ 12న తేజస్‌ యుద్ధవిమానాన్ని పరీక్షించారు వరుణ్ సింగ్. అప్పుడు ఆయన వింగ్‌ కమాండర్‌గా ఉన్నారు. విమానం 10వేల అడుగుల ఎత్తులో ఉండగా పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. జనరల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో ఏ ఫైలట్‌ అయినా విమానాన్ని వదిలేసి పారాచ్యూట్‌తో దూకేస్తారు.

కానీ వరుణ్‌ సింగ్ మాత్రం అలా చేయలేదు..తన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా రిస్క్ చేశారు. విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశారు. తేజాస్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను సేఫ్‌ ల్యాండ్ చేసినందుకే ఆయనకు శౌర్యచక్ర అవార్డునిచ్చారు.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..