Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

ఏదైనా విమాన ప్రమాదం జరిగితే.. అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను రికార్డ్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..
Black Box Not Yet Found
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Dec 09, 2021 | 9:20 AM

Army Helicopter Crash:హెలికాఫ్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దంపతులు సహా మొత్తం 13మంది మృతి చెందారు. ఐతే అసలు ఈ ప్రమాదానికి కారణమేంటన్న దానిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతికూల వాతావరణమే హెలికాఫ్టర్‌ క్రాష్‌ అవడానికి కారణంగా తెలుస్తోంది. కుప్పకూలిన హెలికాప్టర్ వద్ద వింగ్ కమాండర్ భరద్వాజ్ ఆధ్వర్యంలో బ్లాక్ బాక్స్ సెర్చింగ్ కొనసాగుతోంది. బ్లాక్ బాక్స్ కోసం నిపుణుల బృందం అన్వేషణ కొనసాగిస్తోంది. బ్లాక్ బాక్స్ కోసం కాటేరు పార్క్ లో జల్లెడ పట్టనున్నారు వెల్లింగ్టన్ మిలటరీ క్యాంప్ అధికారులు. ఏదైనా విమాన ప్రమాదం జరిగితే.. అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను రికార్డ్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు వీలవుతుంది.

బ్లాక్ బాక్స్ కోసం అన్వేషణ…

ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ ఎక్కడ వుందో అన్వేషిస్తారు. దీని ఆధారంగానే ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుంది. బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్‌లోనే ఎందుకుంటుందో అనేదాని వెనక కూడా ఒక కారణం ఉంది. సాధారణంగా ప్రమాదసమయాల్లో ఒకవేళ మంటలు చెలరేగితే అన్నీ తగలబడిపోయే అవకాశం ఉంది. ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్‌ బాక్స్‌ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్‌కు ఆరెంజ్ కలర్ ఉంటుంది.

ఈ బ్లాక్ బాక్స్‌ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా ధ్వంసం కాకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలతో దీన్ని రూపొందిస్తారు. సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఏవిధంగా ప్రమాదానికి గురైందో విచారణలో బయటపడనుంది. బ్లాక్ బాక్స్ లభ్యం అయితే అనేక విషయాలు బయటపడతాయి.

హెలికాప్టర్లో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఏర్పడ్డాయో తేలనుంది.వింగ్ కమాండర్ భరద్వాజ్ బ్లాక్ బాక్స్ సెర్చింగ్ యుద్ధ ప్రాతిపదికన సాగుతోంది.బ్లాక్ బాక్స్‌లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది.క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం మాత్రమే విశ్లేషణకు పనికొస్తుంది. బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11మంది మరణానికి కారణమయిన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. విచారణలో ఏం తేలనుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.