Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

మెరుపు దాడులు చేయడంలో సాయితేజ దిట్ట. ఇండియన్ ఆర్మీలో పారా కమాండోస్‌ది ప్రత్యేక స్థానం. అవసరమైతే నేరుగా శత్రుస్థావరాలకెళ్లి మట్టికరిపించే సామర్ధ్యం వీళ్ల సొంతం. అలాంటి పారా ట్రూపర్స్ ఉండే..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..
Sai
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 09, 2021 | 8:16 AM

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో పారా కమాండో సాయితేజ దుర్మరణం పాలవడం తెలుగువాళ్లందరినీ కలిచివేస్తోంది. సాయితేజ సొంతూరు చిత్తూరు జిల్లా రేగడంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాయితేజ ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అంతా సాయితేజను తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. 2012లో ఆర్మీ జవాన్‌గా ఎంపికైన సాయితేజ.. మొదట బెంగళూరు రెజిమెంట్‌లో.. ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌లో పనిచేశారు. ఆ తర్వాత పారా కమాండోకి ఎంపికై అనేక కఠిన సవాళ్లను దాటుకుని పారా ట్రూపర్‌గా ఎదిగారు. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లేలా రాటుదేలిన సాయితేజ.. సీడీఎస్‌ బిపిన్ రావత్‌ను సైతం మెప్పించి ఆయన టీమ్‌లో చేరారు.

మెరుపు దాడులు చేయడంలో సాయితేజ దిట్ట. ఇండియన్ ఆర్మీలో పారా కమాండోస్‌ది ప్రత్యేక స్థానం. అవసరమైతే నేరుగా శత్రుస్థావరాలకెళ్లి మట్టికరిపించే సామర్ధ్యం వీళ్ల సొంతం. అలాంటి పారా ట్రూపర్స్ ఉండే టీమ్‌ నుంచి సీడీఎస్‌ బిపిన్ రావత్‌ టీమ్‌కి ఎంపికయ్యాడు సాయితేజ.

సాయితేజ శక్తి సామర్ధ్యాలను గుర్తించిన సీడీఎస్‌ బిపిన్ రావత్‌.. తన పర్సనల్‌ సెక్యూరిటీ టీమ్‌లో పెట్టుకున్నారు. సాయితేజను బిపిన్ రావత్‌ ఎంతో అభిమానించేవారని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. బిపిన్ రావత్‌ ప్రోత్సాహంతో పారా కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు సాయితేజ.

సాయితేజ తల్లిదండ్రులు మోహన్, భువనేశ్వరి. సాయితేజ తమ్ముడు మహేష్ కూడా ఆర్మీలోనే ఉన్నాడు. సాయితేజకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు మోక్షజ్ఞకు నాలుగేళ్లు. కూతురు దర్శినికి రెండేళ్లు.

హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడారు. పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించారు. వీడియో కాల్ మాట్లాడాక కొన్ని గంటల్లోనే సాయితేజ దుర్మరణం పాలయ్యాడు.

సాయితేజ మృతదేహాన్ని ఈరోజు సొంతూరుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. సాయితేజ సొంతూరైన రేగడి గ్రామంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Astro tips for wallet: మీ పర్సు ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?