CDS Bipin Rawat: వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో పార్థివదేహాలు.. రేపు ఢిల్లీలో రావత్ దంపతుల అంత్యక్రియలు
సీడీఎస్ బిపిన్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారి భౌతికకాయాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నాయి. ప్రముఖుల నివాళుల తర్వాత భౌతికకాయాలను ఈ సాయంత్రం..
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జనరల్ బిపిన్ రావత్ మృతితో యావత్ దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించి అమరుడైన బిపిన్‌ను తలచుకుని దేశం మొత్తం విలపిస్తోంది. సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఆర్మీ అధికారులందరికీ పార్లమెంట్ నివాళులర్పించనుంది. దుర్ఘటనపై ఉభయ సభల్లో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటన చేయనున్నారు.
సీడీఎస్ బిపిన్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారి భౌతికకాయాలు వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నాయి. ప్రముఖుల నివాళుల తర్వాత భౌతికకాయాలను ఈ సాయంత్రం లేదా రాత్రికి కోయంబత్తూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తరలిస్తారు.
రావత్ దంపతుల అంత్యక్రియలు రేపు ఢిల్లీ కంటోన్మెంట్‌లో జరగనున్నాయి. రేపు ఉదయం 11నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు భౌతికకాయాలను ఆయన నివాసంలో ప్రజల సందర్శనార్ధం ఉంచుతారు. అనంతరం, కామరాజ్ మార్గం మీదుగా కంటోన్మెంట్ ఏరియాలోని బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు అంతియ యాత్ర నిర్వహిస్తారు. తుది వీడ్కోలు తర్వాత సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంతిమ సంస్కారాలు చేస్తారు.
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మిగతా ఆర్మీ అధికారుల భౌతికకాయాలను కూడా ఈ సాయంత్రం లేదా రాత్రికి స్వస్థలాలకు తరలిస్తారు.
ఇవి కూడా చదవండి: Army Helicopter Crash: హెలికాప్టర్ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..