Railway Omicron Alert: రైల్వే ప్రయాణికులు ఇది పాటించాల్సిందే.. కీలక ఆదేశాలు జారీ చేసిన రైల్వే అధికారులు..!
Railway Omicron Alert: కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే అలర్ట్ అవుతున్నారు అధికారులు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రదేశాల్లో కొవిడ్ రూల్స్‌ని కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా దేశంలో
Railway Omicron Alert: కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే అలర్ట్ అవుతున్నారు అధికారులు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ప్రదేశాల్లో కొవిడ్ రూల్స్‌ని కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. దక్షిణాఫ్రికాతో పాటు యూరప్ నుంచి వస్తున్న విదేశీ ప్రయాణికులతో మనదేశంలో కూడా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం ఆదేశాలతో అలర్ట్ అయ్యారు రైల్వేశాఖ అధికారులు. ఈ క్రమంలోనే రైల్వేస్టేషన్లలో నో మాస్క్ నో ఎంట్రీ ఆదేశాలను జారీ చేసింది. మాస్క్ లేని వారికి రైల్వే స్టేషన్ల, రైళ్లలో ప్రవేశం లేదంటున్నారు దక్షిణ మద్య రైల్వే అధికారులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు అధికారులు. టిక్కెట్టు ఉన్నా మాస్క్ లేకుంటే వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు.. మాస్క్ లేకపోతే 500 రూపాయలు ఫెనాల్టీ విధిస్తామంటున్నారు.
నో మాస్క్ నో ఎంట్రీ ఆదేశాల జారీతో రైల్వే స్టేషన్లో సిబ్బంది మాస్క్ లేని వారిని జల్లెడపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మాస్క్ లేని ప్రయాణీకులకు ఫెనాల్టీలు విధిస్తున్నారు. కొవిడ్ రూల్స్ పాటించని వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడికక్కడ కొవిడ్ రూల్స్ పాటించేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్ విజృంభించక ముందే అప్రమత్తం కావాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు రైల్వేశాఖ అధికారులు.
Also read: