14న తమిళనాడులో మొబైల్స్ బంద్.. ఎందుకంటే..!

మొబైల్స్ వచ్చినప్పటి నుంచి అందరూ దానికే బానిసలుగా మారిపోయారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండగా.. పక్కనున్న మనిషితో కూడా మనసు విప్పి మాట్లాడటం లేదు. బయట మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తరువాత పిల్లలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. వంద శాతం అని చెప్పకపోయినా.. దాదాపుగా 90శాతం ప్రతి ఇంట్లో పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ […]

14న తమిళనాడులో మొబైల్స్ బంద్.. ఎందుకంటే..!
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2019 | 11:52 AM

మొబైల్స్ వచ్చినప్పటి నుంచి అందరూ దానికే బానిసలుగా మారిపోయారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉండగా.. పక్కనున్న మనిషితో కూడా మనసు విప్పి మాట్లాడటం లేదు. బయట మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా మొబైల్స్ వచ్చిన తరువాత పిల్లలు, తల్లిదండ్రుల మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. వంద శాతం అని చెప్పకపోయినా.. దాదాపుగా 90శాతం ప్రతి ఇంట్లో పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్స్‌ను బంద్ చేయాలంటూ తెలిపింది. ఉదయం 7.30 గంటల నుంచి 8.30గంటల వరకు ఓ గంట పాటు సెల్‌ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో మాట్లాడాలని తెలిపింది. ఆ సమయంలో వారి గురించి అన్ని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలకు ఓ సర్య్కులర్ పంపింది. అంతేకాదు కనీసం వారంలో ఒకసారి అయినా ఇలా చేస్తే మరింత బావుంటుందని రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయపడింది. పిల్లలతో తల్లిదండ్రులు మరింత సమయాన్ని వెచ్చించేందుకు ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే.