Women Priests in Temples: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. ఆలయాల్లో మహిళా అర్చకుల నియామకానికి మార్గదర్శకాలు!
తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆలయాల్లో మహిళ అర్చకులను నియమించాలని నిర్ణయించారు.
Women Priests in Tamil Nadu Temples: తమిళనాడులో అధికారం చేపట్టిన నాటినుంచి డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించి ప్రశంసలు అందుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి అయితేనేం.. ఒక సాధారణ వ్యక్తినేనంటూ నిరూపిస్తున్నారు. హంగుఆర్భాటాలకు దూరంగా ఉండే స్టాలిన్.. తాజాగా తన కాన్వాయ్‌ను ఆపి మరీ.. ఓ మహిళ దగ్గర ఫిర్యాదును స్వీకరించారు. ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలతో చెరగని ముద్ర వేసుకోవాలని చూస్తున్నారు సీఎం ఎంకే స్టాలిన్. తాజాగా ఆలయాల్లో మహిళ అర్చకులను నియమించాలని నిర్ణయించారు.
తమిళనాడులో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే.. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చి హామీని నిలబెట్టుకునేందుకు తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో మహిళా అర్చకుల నియమించాలని తమిళనాడు రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తమిళంలోనే అర్చనలు జరిగేలా ఏర్పాటు చేయాలని సూచించింది. అర్చకత్వంలో మహిళకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 100 రోజుల వ్యవధిలోనే విద్య అర్హతని బట్టి మహిళలను అర్చకులుగా తీసుకోవడానికి కమిటీ ఏర్పాటు చేసింది స్టాలిన్ ప్రభుత్వం. ఇందు కోసం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కులాలకు అతీతంగా, పురుషులకు , మహిళలకు అర్చకత్వంలో అవకాశం కల్పిస్తామని మంత్రి శేఖర్ బాబు హామీ ఇచ్చారు.
Read Also... Youth Suicide: విశాఖపట్నంలో విషాదం.. కుక్క పిల్ల కోసం ప్రాణాలు తీసుకున్న యువకుడు..