హిందీకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న స్టాలిన్ సర్కార్.. ఏం చేయబోతున్నారంటే..?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీని వ్యతిరేకిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు హిందీని రుద్దుతోందని స్టాలిన్ గతంలో ఆరోపించారు. తమిళులపై హిందీని రుద్దుతున్న విధానం వారి ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో హిందీని నిషేధించడానికి సిద్ధమవుతుందా?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందీని వ్యతిరేకిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. తమిళనాడు హిందీని రుద్దుతోందని స్టాలిన్ గతంలో ఆరోపించారు. తమిళులపై హిందీని రుద్దుతున్న విధానం వారి ఆత్మగౌరవానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, స్టాలిన్ ప్రభుత్వం తమిళనాడులో హిందీని నిషేధించడానికి సిద్ధమవుతుందా? తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుందని, ఇది రాష్ట్రంలో హిందీ వాడకాన్ని నిషేధించే లక్ష్యంతో తీసుకువచ్చిన బిల్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే హిందీ సినిమాలు , పాటలు , హోర్డింగ్‌లను నిషేధిస్తూ బిల్లును తీసుకురావాలన్న ఆలోచనపై సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
తమిళనాడులో మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమం ఊపందుకునే పరిస్థితులు కన్పిస్తున్నాయి. హిందీపై, త్రిభాషా సిద్దాంతంపై యుద్దాన్ని కొనసాగిస్తున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో తమిళనాడులో స్టాలిన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హిందీ సినిమాలు , పాటలు , హోర్డింగ్‌లను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. తాము హిందీకి వ్యతిరేకం కాదని, కాని బలవంతంగా తమిళనాడుపై రుద్దితే సహించబోమని స్పష్టం చేశారు సీఎం స్టాలిన్.
హిందీ వ్యతిరేక బిల్లుపై ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించారు సీఎం స్టాలిన్. అయితే బీజేపీ నేతలు స్టాలిన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కావాలనే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గతంలో తమిళంలో రూపాయి సింబల్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై కూడా వివాదం చెలరేగింది. తమిళ సంస్కృతిని దెబ్బతీసేందుకే కేంద్రం త్రిభాషా విధానాన్ని తెరపైకి తెచ్చిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు.
అయితే విపక్షాల నుంచి అభ్యంతరాలతో పాటు న్యాయపరమైన చిక్కులు వస్తాయని నిపుణులు హెచ్చరించడంతో హిందీ పాటలు , సినిమాలు , హోర్డింగ్‌లపై నిషేధం విషయంలో స్టాలిన్ వెనక్కి తగ్గినట్టు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల చివరి రోజు బిల్లు పెట్టాలని అనుకున్నారు. కాని న్యాయనిపుణుల సలహాతో ఈ బిల్లుపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




