Train Accidents: ఇది కొత్తరకం ఉగ్రవాదం.. ప్రయాణికుల రైళ్లే లక్ష్యం.. ప్రమాదాలుగా చిత్రీకరించే యత్నం

ఉగ్రవాదం రూపు మార్చుకుంటోంది. ఒకప్పుడు మారణాయులు, పేలుడు పదార్థాలతో సృష్టించే విధ్వంసాల ద్వారా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకునేవారు. ఆ తర్వాత నకిలీ కరెన్సీ, సైబర్ నేరాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ఆర్థిక ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ద్వారా దేశ యువతను మత్తుకు బానిసగా మార్చే ఉగ్రవాదం సహా అనేక కొత్త రూపాలు చూశాం.

Train Accidents: ఇది కొత్తరకం ఉగ్రవాదం.. ప్రయాణికుల రైళ్లే లక్ష్యం.. ప్రమాదాలుగా చిత్రీకరించే యత్నం
Train Accident
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 12, 2024 | 11:57 AM

ఉగ్రవాదం రూపు మార్చుకుంటోంది. ఒకప్పుడు మారణాయులు, పేలుడు పదార్థాలతో సృష్టించే విధ్వంసాల ద్వారా ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలు బలితీసుకునేవారు. ఆ తర్వాత నకిలీ కరెన్సీ, సైబర్ నేరాల ద్వారా దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసే ఆర్థిక ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ద్వారా దేశ యువతను మత్తుకు బానిసగా మార్చే ఉగ్రవాదం సహా అనేక కొత్త రూపాలు చూశాం. ఇప్పుడు మారణాయుధాలు, మాదక ద్రవ్యాల రవాణా కష్టతరం కావడంతో ప్రమాదాలు సృష్టించి మరీ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్న కొత్త రకం ఉగ్రవాదం దేశంలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైలు పట్టాలకు అడ్డంగా భారీ వస్తువులను పెట్టడం ద్వారా ప్రమాదాలు సృష్టించే ప్రయత్నాలు వెలుగుచూస్తున్నాయి. బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన తీరును గమనిస్తే.. సిగ్నలింగ్ వ్యవస్థను దెబ్బతీసి.. లూప్‌లైన్లో ఆగి ఉన్న గూడ్సు రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టేలా కుట్ర జరిగింది. తాజాగా మళ్లీ అదే తరహాలో తమిళనాడులో మరో రైలు ప్రమాదం జరిగింది. లూప్‌లైన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ వచ్చి ఢీకొట్టింది. చివరి నిమిషంలో గుర్తించిన లోకో‌పైలట్ అప్రమత్తం కావడంతో ప్రాణనష్టాన్ని నివారించగలిగారు. అయితే ఈ ఘటనలో దాగిన కుట్రకోణం జాతీయ భద్రతకు సంబంధించిన కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మరోవైపు రైల్వే శాఖలోనూ అంతర్గతంగా సీఆర్ఎస్ విచారణకు ఆదేశించింది.

బాలాసోర్ తరహాలో… భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం

మైసూర్-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) ప్రమాదంపై భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. ఇది ప్రమాదావశాత్తూ జరిగిన ఘటన కాదని, ఉద్దేశపూర్వకంగానే ప్రమాదం జరిగేలా కొందరు ప్రయత్నించారని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ప్రమాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కవరైపేట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగినట్లుగానే భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. తీరా ఆ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ గూడ్స్ రైలు నిలిచి ఉంది. దీంతో ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. చివరిక్షణంలో భాగమతి ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ అప్రమత్తమయ్యాడు. షాక్ నుంచి తేరుకుంటూ బ్రేకులు వేశాడు. అయినప్పటికీ ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేకపోయాడు. అయితే ప్రమాద తీవ్రతను తగ్గించగలిగాడు. ఈ ఘటనలో పాసింజర్ రైలు గూడ్స్ రైలును ఢీకొన్నప్పుడు, దాని రెండు కోచ్‌లు మంటల్లో చిక్కుకున్నాయి. సుమారు 12-13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 19 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ వెంటనే చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ క్షతగాత్రులను పరామర్శించారు. పండుగల సీజన్ కావడంతో రైలులో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రమాద తీవ్రత తగ్గింది కాబట్టి సరిపోయింది. లేదంటే బాలాసోర్ తరహాలో వందల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.

కుట్రను బయటపెట్టేందుకు…

ఈ ప్రమాదంపై విచారణకు రైల్వేశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని ప్రకటించింది. రైల్వే ఉద్యోగి తప్పిదం వల్ల ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా కావాలని సిగ్నల్‌ను హ్యాక్ చేసి ప్రమాదం జరిగేలా చేశారా అన్న కోణాల్లో విచారణ జరగనుంది. రైల్వే సీఎస్‌ఆర్‌ (కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ) తో పాటు ప్రమాదం వెనుక కుట్ర, ఉగ్రవాద దుశ్చర్య కోణాలపై NIA విచారణ చేపట్టనుంది. మైసూరు-దర్భంగా బాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదం కారణంగా చాలా రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులందరినీ EMU రైళ్ల ద్వారా చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు తరలిస్తున్నట్టు నైరుతి రైల్వే తెలిపింది. దర్భంగా సహా ఇతర గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఉచిత ఆహారం, నీరు, స్నాక్స్‌ అందించి చెన్నైలో మరో రైలు సిద్ధం చేసినట్టు వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..