Delhi: చెత్త రాజకీయాలు ఆపండి.. బీజేపీకి స్వాతి మలివాల్ స్ట్రాంగ్ కౌంటర్..
ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతిమలివాల్‌కు వేధింపుల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. స్వాతిమలివాల్ వేధింపుల పేరుతో డ్రామా ఆడారని, దీనిపై విచారణ జరిపించాలని..

ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతిమలివాల్‌కు వేధింపుల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. స్వాతిమలివాల్ వేధింపుల పేరుతో డ్రామా ఆడారని, దీనిపై విచారణ జరిపించాలని బీజేపీ ఎల్జీ వీకే సక్సేనాకు లేఖ రాసింది. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదన్న విషయాన్ని బయటపెట్టిన్నందుకు బీజేపీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు స్వాతి మలివాల్.
ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ వేధింపుల సంఘటనను డ్రామాగా కొట్టిపారేసింది బీజేపీ. ఇది పోలీసులను అపఖ్యాతిపాలు చేసేందుకు పన్నిన కుట్రగా బీజేపీ నేత షాజియా ఇల్మీ విమర్శించారు.. స్వాతిని వేధించిన వ్యక్తి ఎవరో కాదని , ఆప్ కార్యకర్త అని ఆరోపించారు. అయితే బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని . ఈ వ్యవహారంపై చివరవరకు పోరాడుతానని అన్నారు స్వాతి మాలివాల్. బీజేపీ బెదిరింపులకు తాను భయపడడం లేదని స్పష్టం చేశారు.
కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు స్వాతిమలివాల్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పోలీసు దర్యాప్తును ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు బీజేపీ లేఖ రాసింది. హరీశ్ చంద్ర సూర్యవంశి మద్యం మత్తులో స్వాతి మలివాల్‌ను కారుతో ఈడ్చుకెళ్లినట్లు కేసు నమోదైందని, ఈ సంఘటనను అందరూ ఖండించారని బీజేపీ నేతలంటున్నారు. . ఢిల్లీ పోలీసులు వేగంగా స్పందించి, ఓ గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే నిందితునికి ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్నందువల్ల పోలీసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు స్వాతి తన రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తారని ఆరోపించారు.




అయితే బీజేపీ నేతల ఆరోపణలు తీవ్రంగా ఖండించారు స్వాతి మలివాల్. ఢిల్లీలో మహిళలకు రక్షణ లేదని , పోలీసుల వైఫల్యాన్ని బయటపెడితే బీజేపీ నేతలు డ్రామా కొట్టిపారేయడం సిగ్గుచేటని అన్నారు. తాను తుది శ్వాస వరకు న్యాయం కోసం పోరాడతానని స్వాతి మలివాల్ స్పష్టం చేశారు. డీసీడబ్ల్యూ చీఫ్‌కే రక్షణ లేకపోతే ఇంకెవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..