India China Border Row: చైనాకు దిమ్మతిరిగేలా వార్నింగ్.. సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు సిద్ధమవుతున్న భారత్..!
భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిద్ధమవుతోంది.

భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో సరిహద్దుల్లో భారీ విన్యాసాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిద్ధమవుతోంది. 32 నెలల నుంచి భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలతో ఇది మరింత ముదిరింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లతో భారీ స్థాయిలో విన్యాసాలు చేపట్టనుంది. లద్ధాఖ్ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పరిశీలించిన తర్వాత ఇండియా ఈ దిశగా అడుగులు వేస్తోంది.
తూర్పు ఎయిర్ కమాండ్ అధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు చేపట్టే ఈ విన్యాసాలకు ప్రళయ్ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. రఫేల్, సుఖోయ్ 30 MKI లాంటి ఫైటర్ జెట్లు, చినూక్, అపాచీ హెలికాప్టర్ల వంటివి ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. ఈస్ట్రన్ సెక్టార్‌లో ఈ స్థాయిలో విన్యాసాలు చేపట్టడం ఇది రెండోసారి. మొన్న డిసెంబర్ 15-16 తేదీల్లో వాస్తవాధీన రేఖ వెంబటి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిన్యాసాలు చేపట్టింది.
మరో వైపు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పీపుల్ లిబరేషన్ సైనికులతో శుక్రవారం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధానికి సిద్ధమేనా అంటూ జిన్‌పింగ్ ప్రశ్నించారు.




సరిహద్దుల్లో వరుసగా మూడోసారి చైనా 50 వేల మంది సైనికులతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలను మొహరించడంతో ఇండియా ఈ విన్యాసాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాకు గట్టి సమాధానం చెప్పడమే కాదు ఈ విన్యాసాల ద్వారా తన శక్తిని భారత్ తెలియజేయబోతోంది. భారత్, చైనా మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ సరిహద్దుగా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..