Coronavirus: ‘కరోనా’ వైరస్ కాదు.. జంతువులను కాపాడటానికి వచ్చిన అవతారం

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. గంట గంటకు వ్యాధి లక్షణాలు కలిగిన వారి సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఇక మృతుల సంఖ్య రోజు రోజుకూ వందలు దాటుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ ప్రభావం ఆందోళన కలిగించడమే కాకుండా.. అక్కడ కర్ఫ్యూ వాతావరణాన్ని కూడా సృష్టిస్తోంది. రద్దీగా ఉండే రోడ్లు.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనంతో కిటకిటలాడే మెట్రో రైళ్లు, కళకళలాడే షాపింగ్ మాల్స్ అన్నీ మూగబోయాయి. ఎటు చూసినా అంతా నిర్మానుష్యమే ఆవరించి […]

Coronavirus: 'కరోనా' వైరస్ కాదు.. జంతువులను కాపాడటానికి వచ్చిన అవతారం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 7:57 PM

ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. గంట గంటకు వ్యాధి లక్షణాలు కలిగిన వారి సంఖ్య వేలల్లో పెరుగుతోంది. ఇక మృతుల సంఖ్య రోజు రోజుకూ వందలు దాటుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ ప్రభావం ఆందోళన కలిగించడమే కాకుండా.. అక్కడ కర్ఫ్యూ వాతావరణాన్ని కూడా సృష్టిస్తోంది. రద్దీగా ఉండే రోడ్లు.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనంతో కిటకిటలాడే మెట్రో రైళ్లు, కళకళలాడే షాపింగ్ మాల్స్ అన్నీ మూగబోయాయి. ఎటు చూసినా అంతా నిర్మానుష్యమే ఆవరించి ఉంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల మంది చనిపోతున్నారు.

అయితే ‘కరోనా’ వైరస్ కాదు.. జంతువులను కాపాడటానికి వచ్చిన అవతారమని అన్నారు స్వామిజీ చక్రపాణి. జంతువులను చంపి తినే మాంసాహారులను అంతం చేసి, మానవాళికి ఓ సందేశం ఇవ్వడానికే ‘కరోనా వైరస్’ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ దెబ్బతో చైనీయులకు గుణపాఠం వస్తుందన్నారు. ఇప్పటికైనా జంతువులను చంపి తినడం మానేసి వెజిటేరియన్స్‌గా మారాలని.. చైనీయులకు సలహా ఇచ్చారు స్వామీజీ. ‘కరోనా విగ్రహాన్ని’ ప్రతిష్టించి పూజలు చేస్తే.. తన అవతారం చాలించి, తన లోకానికి కరోనా వెళ్లిపోతుందని స్వామీజీ చక్రపాణి పేర్కొన్నారు.