సీఏఏకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఒక్కటైన జంట..

తమిళనాడులో ఓ ముస్లిం జంట వినూత్న రీతిలో వివాహం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. అనేక చోట్ల నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైకి చెందిన సుమయ్యా, షహిన్ షా అనే ఓ ముస్లిం జంట.. తమ నిరసనను వినూత్న రీతిలో ప్రదర్శించారు. సోమవారం నార్త్ చెన్నైలో జరిగిన ఈ పెళ్లిలో.. తాము సీఏఏ. ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామంటూ.. ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ నవదంపతులు నివాసముండే ప్రాంతంలో గత కొద్ది రోజులుగా […]

సీఏఏకి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. ఒక్కటైన జంట..
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2020 | 6:14 AM

తమిళనాడులో ఓ ముస్లిం జంట వినూత్న రీతిలో వివాహం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. అనేక చోట్ల నిరసనలకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైకి చెందిన సుమయ్యా, షహిన్ షా అనే ఓ ముస్లిం జంట.. తమ నిరసనను వినూత్న రీతిలో ప్రదర్శించారు. సోమవారం నార్త్ చెన్నైలో జరిగిన ఈ పెళ్లిలో.. తాము సీఏఏ. ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నామంటూ.. ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ నవదంపతులు నివాసముండే ప్రాంతంలో గత కొద్ది రోజులుగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వీరు వివాహంలో ఇలా వినూత్న రీతిలో వారి నిరసనను ఫ్లకార్డులతో ప్రదర్శించారు. కాగా, ఈ నెల 24న పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో చేసేందుకు అక్కడి ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఈ నవదంపతులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది.