Political Strategist : ప్రశాంత్ కిశోర్‌కు ‘జడ్ కేటగిరీ’ భద్రత..!
Political Strategist : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐఫ్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్(పీకే)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్టుగానే పీకే.. మీడియా చేస్తోన్న ఫోన్ కాల్స్‌కి కూడా సమాధానం ఇవ్వడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత, పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. […]
Political Strategist : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐఫ్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్(పీకే)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్టుగానే పీకే.. మీడియా చేస్తోన్న ఫోన్ కాల్స్‌కి కూడా సమాధానం ఇవ్వడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో టీఎంసీ ఘోరంగా విఫలమైన తర్వాత, పీకేను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుంది. అందుకు తగ్గట్టుగానే బెంగాల్‌లో గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో టిఎంసి మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది.
కాగా పశ్చిమ బెంగాల్‌లో ప్రజా జీవితంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, కిషోర్‌కు రాష్ట్ర ప్రభుత్వ వ్యయంతో ‘జెడ్’ కేటగిరీ భద్రత ఎందుకు కల్పిస్తున్నారని సిపిఐ (ఎం) శాసనసభ పార్టీ నాయకుడు సుజన్ చక్రవర్తి ప్రశ్నించారు. ఇక జెడి (యు) గత నెలలో.. ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తోన్న కిశోర్‌ను..పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండటం లేదన్న కారణంతో బహిష్కరించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాదిరిగానే కిషోర్ పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పిఆర్) పై తీవ్ర విమర్శలు చేశారు.