Fire Accident : భార్యను కాపాడి..తాను మృత్యు ఒడిలోకి..
Fire Accident : మంటల్లో చిక్కుకుపోయిన తన అర్ధాంగిని కాపాడిన ఓ వ్యక్తి..తాను మాత్రం మృత్యువును జయించలేకపోయాడు. వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన అనిల్.. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి అబుదాబీలో నివశిస్తున్నాడు. వారు నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లో గత వారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారిడార్‌లో పని చేసుకుంటున్న అనిల్ భార్య నీనూ మంటల్లో చిక్కుపోయింది. ఆమె అరుపులు విన్న అనిల్..భార్యను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెకు బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరికి […]
Fire Accident : మంటల్లో చిక్కుకుపోయిన తన అర్ధాంగిని కాపాడిన ఓ వ్యక్తి..తాను మాత్రం మృత్యువును జయించలేకపోయాడు. వివరాల్లోకి వెళ్తే..కేరళకు చెందిన అనిల్.. తన భార్య, నాలుగేళ్ల కుమారుడితో కలిసి అబుదాబీలో నివశిస్తున్నాడు. వారు నివాసం ఉంటోన్న అపార్ట్‌మెంట్‌లో గత వారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారిడార్‌లో పని చేసుకుంటున్న అనిల్ భార్య నీనూ మంటల్లో చిక్కుపోయింది. ఆమె అరుపులు విన్న అనిల్..భార్యను కాపాడేందుకు విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు ఆమెకు బయటకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరికి మంటలు అంటుకున్నాయి.
వెంటనే వారిని లోకల్ హాస్పటల్‌కి తరలించారు. గాయాల తీవ్రత ఎక్కువ ఉండటంతో..అక్కడి నుంచి అబుదాబీలోని మరో ఆస్పత్రికి షిప్ట్ చేశారు. అయితే అనిల్ 90 శాతం కాలిన గాయాలతో..మృత్యువును ఎదిరించలేక సోమవారం (ఫిబ్రవరి 17) తుదిశ్వాస విడిచారు. 10 శాతం గాయాలైన అతడి భార్య నీనూ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. కాగా అనిల్ చనిపోయిన విషయం నినూకి.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా చెప్పాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు జరుగుతున్నాయి.