RRR: ‘రామ రాజు’గా చెర్రీ.. ‘సీతా మహాలక్ష్మి’గా అలియా.. లుక్‌లు లీక్..!

RRR movie news: టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ తెలుగుతో పాటు 10 భారతీయ భాషల్లో ఏకకాలంలో విడుదల అవ్వనుండగా.. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ […]

RRR: 'రామ రాజు'గా చెర్రీ.. 'సీతా మహాలక్ష్మి'గా అలియా.. లుక్‌లు లీక్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 18, 2020 | 11:01 AM

RRR movie news: టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ తెలుగుతో పాటు 10 భారతీయ భాషల్లో ఏకకాలంలో విడుదల అవ్వనుండగా.. ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. అలియా భట్ ఆయన ప్రేయసి సీతా మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఇక వీరిద్దరి లుక్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో బ్రిటీష్ సైనికాధికారిగా కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం నాటి పద్దతిలో చీర కట్టుకొని కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు కూడా అప్పటిలోలా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉండటం విశేషం. అంతేకాదు వాటిపై రాజమౌళి ముద్ర కూడా ఉంది. మరి ఇవి నిజంగానే సినిమాలోవేనా..? లేక ఫ్యాన్స్ చేశారా..? అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

కాగా ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తుండగా.. అజయ్ దేవగన్, ఒలివియా మారిస్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అటు అభిమానులతో పాటు ఇటు సినీ విశ్లేషకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

https://www.instagram.com/p/B8qRkgDHj3B/?utm_source=ig_embed