Bheeshma: ‘భీష్మ’ ట్రైలర్ వచ్చేసింది.. అదృష్టవంతుడితో పోరాడి గెలవలేం!
యంగ్ హీరో నితిన్ తాజాగా చేసిన చేసిన సినిమా ‘భీష్మ’. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కానుంది. ఈ రోజే ఎంతో ఘనంగా భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ట్రైలర్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం. ‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా అండ్ వ్యవసాయం బ్యాక్ గ్రౌండ్‌లో ఈ […]
యంగ్ హీరో నితిన్ తాజాగా చేసిన చేసిన సినిమా ‘భీష్మ’. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదల కానుంది. ఈ రోజే ఎంతో ఘనంగా భీష్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ట్రైలర్‌ని రిలీజ్ చేసింది మూవీ టీం.
‘కామెడీ ఎంటర్‌టైనర్‌గా అండ్ వ్యవసాయం బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజు, యమ ధర్మరాజు, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా.. పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి అయిన భీష్మ అనే పేరు పెట్టారేంటి అమ్మా నాకు. దాని వల్లేనేమో ఏ ఒక్క అమ్మాయి కూడా నాకు పడటం లేదు అంటూ’.. నితిన్ డైలాగ్స్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. కాగా ఇందులో పలువురు ప్రముఖ నటులతో పాటు..రఘుబాబు, బ్రహ్మజీ, వెన్నెల కిషోర్‌లు నటిస్తున్నారు. కాగా.. ‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత గ్యాప్ తీసుకున్న నితిన్ మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.