AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సు దొంగతనం..చివరకు ఏం చేశాడంటే..!

ఓ వ్యక్తికి ఏదైనా పెద్ద దొంగతనం చేయాలనిపించింది. అలా ఆలోచిస్తున్నంతలోనే ఎదురుగా బస్టాప్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు కనిపించింది. అంతే వెనుకా, ముందు ఆలోచించకుండా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. తీరా మార్గమధ్యంలో వెళ్లాక లారీని ఢీకొట్టి, ఆ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణికులు కూడా ఉండటం కొసమెరుపు. చదివేందుకు కాస్త ఆసక్తిని పుట్టిస్తోన్న ఈ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని వికారాబాద్ […]

ప్రయాణికులతో సహా ఆర్టీసీ బస్సు దొంగతనం..చివరకు ఏం చేశాడంటే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 18, 2020 | 8:05 AM

Share

ఓ వ్యక్తికి ఏదైనా పెద్ద దొంగతనం చేయాలనిపించింది. అలా ఆలోచిస్తున్నంతలోనే ఎదురుగా బస్టాప్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు కనిపించింది. అంతే వెనుకా, ముందు ఆలోచించకుండా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. తీరా మార్గమధ్యంలో వెళ్లాక లారీని ఢీకొట్టి, ఆ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణికులు కూడా ఉండటం కొసమెరుపు. చదివేందుకు కాస్త ఆసక్తిని పుట్టిస్తోన్న ఈ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. తాండూరు డిపోకు చెందిన ఓ బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ నైట్‌హోల్డ్ బయల్దేరడానికి బస్టాప్‌లో నిలిపి ఉంది. డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. అప్పటికే ప్రయాణికులు బస్సులో ఎక్కి కూర్చున్నారు. అంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సును స్టార్ట్ చేశాడు. కండక్టర్ రాకుండానే బస్సును ఎలా స్టార్ట్ చేస్తావని ప్రయాణికులు ప్రశ్నించగా.. దీనికి నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ మాట్లాడి.. బస్టాప్ నుంచి రయ్‌మంటూ తీసుకెళ్లాడు. ఆ తరువాత మల్లప్పమడిగ దగ్గరకు వెళ్లగానే ఓ లారీని ఢీకొట్టాడు. ఇక ఆ భయంతో నడిరోడ్డు మీదే బస్సును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ సంఘటన నుంచి కాస్త తేరుకున్న ప్రయాణికులు డిపో మేనజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత బస్సును తిరిగి డిపోకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే మద్యంలో ఉండటం వల్లనే ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ తెలంగాణలో ఓ ఆర్టీసీ బస్సును అపహరించిన దుండగులు.. అందులో ప్రధాన భాగాలన్నీ తీసుకొని వేరే ప్రదేశంలో వదిలేసిన విషయం తెలిసిందే.

సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
సూర్యాస్తమయం తర్వాత.. ఆలయంలోకి వెళ్లే సాహసం ఎవరూ చేయరు
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే..
ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు దెబ్బతిన్నట్లే..
రక్తపోటును శాశ్వతంగా తరిమే డ్రింక్.. రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే?
రక్తపోటును శాశ్వతంగా తరిమే డ్రింక్.. రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే?
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
హైబీపీతో గుండెకే కాదు.. కంటి చూపునకూ ముప్పే
టెస్టుల్లో పక్కన పెట్టారని, టీ20ల్లో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే
టెస్టుల్లో పక్కన పెట్టారని, టీ20ల్లో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
పెరుగమ్మ పెరుగు.. మళ్లీ మళ్లీ తినాలనిపించే పెరుగు
ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు
ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ పనులు చేస్తే చాలు
'ఇక మారవా.. ఆ షాట్‌ను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్‌లో పడేయ్'
'ఇక మారవా.. ఆ షాట్‌ను తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్‌లో పడేయ్'
చిన్న వ్యాపారులకు RBI న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి త్త రూల్స్
చిన్న వ్యాపారులకు RBI న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇక అమల్లోకి త్త రూల్స్
మసాజ్ చేస్తానని భార్య కాళ్లు పట్టుకున్నాడు.. ఆ తర్వాత విషసర్పంతో
మసాజ్ చేస్తానని భార్య కాళ్లు పట్టుకున్నాడు.. ఆ తర్వాత విషసర్పంతో