AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?

జీవితంలో కొత్త అధ్యాయానికి అడుగుపెట్టాల్సిన ఓ యువకుడిని మృత్యువు అర్ధాంతరంగా కబళించింది. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంతలోనే జరిగిన ప్రమాదం అతని ఆశలపై నీళ్లు చల్లింది. ఇంటికి వెళ్తుండగా కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో నీట మునిగి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది.

Andhra News: వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే?
Visakhapatnam Car Accident
Anand T
|

Updated on: Nov 02, 2026 | 2:41 PM

Share

నెల రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు.. అంతలోనే విగతజీవిగా మారాడు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన డ్రీమ్ కారులో ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం అతని ప్రాణాలను బలితీసుకుంది. విశాఖలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలోని మురళీనగర్‌కు చెందిన వరుణ్‌ (26) అనే యువకుడికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో కుటుంబ సభ్యులంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు వరుణ్‌ ఇటీవలే తనకు ఎంతో ఇష్టమైన డ్రీమ్‌ కారైన మహీంద్రా థార్‌ను కొనుగోలు చేశాడు. అలాగే షీలానగర్‌లో ఓ కొత్త ఫ్లాట్‌ కూడా తీసుకున్నాడు.

అయితే, ఏదో పని మీద బయటకు వెళ్లిన వరుణ్‌ తిరిగి ఇంటికి వస్తుండగా ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో అతను ప్రయాణిస్తున్న కారు మలుపు వద్ద అదుపుతప్పి నాతయ్యపాలెం ప్రాంతంలోని కిమ్స్‌ ఆసుపత్రి వెనుక ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారు నీటిలో మునిగిపోవడంతో వరుణ్‌ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

ఉదయం చెరువులో కారును గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. అందులో ఉన్న వరుణ్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
కరువులోనూ కాసుల వర్షం.. ఉల్లి సాగుతో ఏకంగా కోటి సంపాదించిన రైతు..
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
వచ్చే నెలలో పెళ్లి.. అంతలోనే వెంటాడిన మృత్యువు.. అసలేం జరిగిందంటే
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు