స్వదేశీ అంటే విదేశీ వద్దని కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్

గత కొద్ది రోజులుగా దేశంలో స్వదేశీ మంత్రం మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాతో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణ వాతావరణంతో దేశంలో స్వదేశీ నినాదం భారీగా వినిపిస్తోంది. ఈ క్రమంలో..

స్వదేశీ అంటే విదేశీ వద్దని కాదు.. ఆర్ఎస్ఎస్ చీఫ్
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 4:06 PM

గత కొద్ది రోజులుగా దేశంలో స్వదేశీ మంత్రం మార్మోగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాతో గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణ వాతావరణంతో దేశంలో స్వదేశీ నినాదం భారీగా వినిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్‌ భాగవత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వదేశీ అంటే వీదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని.. స్వదేశీ ఉత్పత్తులు, టెక్నాలజీని ప్రోత్సహించడమని అన్నారు. వీటికి ప్రాధాన్యతనివ్వడమే స్వదేశీ ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలో లభించని వస్తువులు, సంప్రదాయికంగా తయారు కాని టెక్నాలజీని, ఇతర వస్తువులను.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన ఆర్ధిక విధానం పనిచేయదని మోహన్‌ భాగవత్‌ అన్నారు.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి