కేరళ వర్షాలు: ఇడుక్కి ప్రాంతాన్ని సందర్శించిన కేరళ గవర్నర్, సీఎం

ఎడతెరిపిలేని వర్షాలతో కేరళ తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన రాజమాల

కేరళ వర్షాలు: ఇడుక్కి ప్రాంతాన్ని సందర్శించిన కేరళ గవర్నర్, సీఎం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 4:56 PM

ఎడతెరిపిలేని వర్షాలతో కేరళ తీవ్రంగా ప్రభావితమైంది. భారీ వర్షాలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడిన రాజమాల ప్రాంతాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం సందర్శించారు. అక్కడ చేపడుతున్న సహాయక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.

కాగా.. గత వారం ఇడుక్కి జిల్లాలోని రాజమాలలో కొండచరియలు విరిగి పడటంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి శిథిలాలను తొలగించే పనులు చేపట్టాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 55 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని సీఎం విజయన్ ప్రకటించారు. కాగా ఒక రాష్ట్ర గవర్నర్, సీఎం కలిసి విపత్తు జరిగిన ప్రాంతాన్ని సందర్శించడం చాలా అరుదు.

[svt-event date=”13/08/2020,3:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ