“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర పోలీసులను కరోనా మహమ్మారి..

మహా పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 12:12 PM

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర పోలీసులను కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే 11 వేల మందికిపైగా కరోనా బారినపడ్డారు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 381 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడ్డ పోలీసు సిబ్బంది సంఖ్య 11,773కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 9,416 మంది సిబ్బంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,233 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర పోలీసు శాఖ వెల్లడించింది.

కాగా,దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే 5లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం నాడు కొత్తగా 66 వేలకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షలకు చేరువైంది.

381 more Maharashtra Police personnel test positive for #COVID19 & 3 died in the last 24 hours, taking the death toll to 124.

Total cases in the police force stand at 11,773, out of which 9,416 have recovered and 2,233 are active cases: #Maharashtra Police pic.twitter.com/AazWLLlZHx

— ANI (@ANI) August 13, 2020

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు