కరోనా ప్రభావం.. భూటాన్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్..

కరోనా వైరస్ దెబ్బకు చిన్న దేశమైన భూటాన్ తొలిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. కువైట్ నుంచి భూటాన్‌కు తిరిగొచ్చిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో..

కరోనా ప్రభావం.. భూటాన్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్..
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 13, 2020 | 4:03 PM

Bhutan Imposes Coronavirus Lockdown: కరోనా వైరస్ దెబ్బకు చిన్న దేశమైన భూటాన్ తొలిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. కువైట్ నుంచి భూటాన్‌కు తిరిగొచ్చిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అక్కడ తొలిసారిగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించారు. ఐదు నుంచి 21 రోజుల వరకు ఉండే ఈ లాక్‌డౌన్‌లో ప్రజలు అందరూ కూడా స్వీయ నిర్భందంలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రస్తుతం భూటాన్‌లో 113 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఒక మరణం కూడా సంభవించలేదు. అందుకే వైరస్ వ్యాప్తిని ముందుగానే కట్టడి చేయడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుమారు 7.5 లక్షల జనాభా ఉన్న ఆ చిన్న దేశం.. ఖచ్చితమైన స్క్రీనింగ్, టెస్టింగ్ లాంటి చర్యలు చేపట్టడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోగలిగింది.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!

ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

 ”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలికి వచ్చిన పార్టీ”..!

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..