కేరళలో ఏనుగుల వధ, కేంద్రానికి, రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేరళలో ఏనుగుల వధపై దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు కేంద్రానికి, కేరళకు నోటీసులు జారీ చేసింది.  ఏనుగులు, ఇతర వన్యమృగాల వధను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని సీజేఐ బాబ్డే ఆధ్వర్యాన గల బెంచ్..ఈ నోటీసుల్లో ఆదేశించింది. కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గత మే నెలలో పేలుడు పదార్థాలు నింపిన పైన్ ఆపిల్ తిని గర్భస్థ ఏనుగు మరణించిన ఉదంతాన్ని అవధ్ బిహారీ అనే అడ్వొకేట్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో […]

కేరళలో ఏనుగుల వధ, కేంద్రానికి, రాష్ట్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 15, 2020 | 5:00 PM

కేరళలో ఏనుగుల వధపై దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు కేంద్రానికి, కేరళకు నోటీసులు జారీ చేసింది.  ఏనుగులు, ఇతర వన్యమృగాల వధను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని సీజేఐ బాబ్డే ఆధ్వర్యాన గల బెంచ్..ఈ నోటీసుల్లో ఆదేశించింది. కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గత మే నెలలో పేలుడు పదార్థాలు నింపిన పైన్ ఆపిల్ తిని గర్భస్థ ఏనుగు మరణించిన ఉదంతాన్ని అవధ్ బిహారీ అనే అడ్వొకేట్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో ఏడాదికాలంలో ఎన్నో గజరాజులను చంపారని, కొన్నింటిని చిత్రవధకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు  కేరళ సహా ఇతర రాష్ట్రాల్లో జరిగితే వాటిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించేలా చూడాలని ఆయన తన పిటిషన్ లో అభ్యర్థించారు.