Electoral Bonds: ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. స్టే విధించలేమంటూ స్పష్టీకరణ..

Supreme Court On Electoral Bonds: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయంపై స్టేను విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది...

Electoral Bonds: ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు.. స్టే విధించలేమంటూ స్పష్టీకరణ..
Electoral Bonds
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 26, 2021 | 12:42 PM

Supreme Court On Electoral Bonds: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయంపై స్టేను విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై స్టే విధించలేమంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం స్పష్టం చేసింది. ‘2018, 2019 సంవత్సరాలలో బాండ్లను ఎలాంటి అంతరాయం లేకుండా విడుదల చేశారు. అంతేకాకుండా వీటిని జారీ చేయడంలో తగినంత భద్రత చర్యలు ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయంపై స్టేను విధించమనడంలో న్యాయబద్ధతలేదు’ అని కోర్టు తేల్చిచెప్పింది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 1నుంచి ఎలక్టోరల్‌ బాండ్లను జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఇదిలా ఉంటే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించడంపై స్టేను విధించాలని కోరుతూ ఎన్‌జిఓ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సంస్థ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎడిఆర్‌ తరపున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ గతంలో ఈ విషయమై వాదిస్తూ.. ఎలక్టోరల్‌ బాండ్లు విక్రయించడం వల్ల బూటకపు కంపెనీల ద్వారా రాజకీయ పార్టీలకు అక్రమ మార్గాల్లో నిధులు వస్తాయని వాదించిన విషయం తెలిసిందే. భారత ఎన్నికల కమిషన్‌, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌లు ఎలక్టోరల్‌ బాండ్లకు అభ్యంతరం తెలిపాయని, రాజకీయ పార్టీలకు విరాళం తరహాలో వాటిని జారీ చేయడానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చాయని భూషణ్‌ తెలిపారు. ఎలక్టోరల్‌ బాండ్‌ అంటే తమకు చేసిన దానికి ప్రతిఫలంగా రాజకీయ పార్టీకి నగదు ఇవ్వడం వంటిదేనని భూషణ్‌ వాదించారు.

Also Read: అబ్బాయి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు.. ఒక్కటైన ప్రేమజంట.. కోర్టు సంచలన తీర్పు ఎక్కడంటే..!

Skeleton Mystery: ముగ్గురు భార్యలు.. మూడు అస్తిపంజరాలు.. స్టోరీ తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే..!

కన్నడనాట రాసలీలల వ్యవహారం మరో ట్విస్ట్.. రెండో సీడీని విడుదల చేసిన యువతి.. అందులో ఏముందంటే..?