AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు.. ఒక్కటైన ప్రేమజంట.. కోర్టు సంచలన తీర్పు ఎక్కడంటే..!

కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రేమ పెళ్లికి అర్ధాలు మారిపోయాయా అనిపించకమానదు.. జీవితం అంటే ఏమిటితో తెలియని వయసు.. ఇంకా చెప్పాలంటే మనదేశంలో...

అబ్బాయి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు.. ఒక్కటైన ప్రేమజంట.. కోర్టు సంచలన తీర్పు ఎక్కడంటే..!
Bride Corona
Surya Kala
|

Updated on: Mar 26, 2021 | 12:12 PM

Share

Historical Verdict of Bihar Court: కొంతమంది తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రేమ పెళ్లికి అర్ధాలు మారిపోయాయా అనిపించకమానదు.. జీవితం అంటే ఏమిటో తెలియని వయసు.. ఇంకా చెప్పాలంటే మనదేశంలో ఆ వయసులో అమ్మానాన్నలపై కుటుంబం పై ఆధారపడి జీవించే స్టేజ్. అయితే ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు.. అంతేకాదు.. టీనేజ్ లో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నారు.. అవును

ఆ అబ్బాయికి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. అయితే మైనార్టీ తీరకుండా చేసుకున్న పెళ్లిళ్లు చెల్లవని.. మన చట్టం లో ఉంది.. అయితే వీరిద్దరి పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం మానవతా దృక్పథంతో సంచలన తీర్పు ఇచ్చింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే..

బీహార్‌లోని నలంద జిల్లా కోర్టు గత శనివారం (2021 మార్చి 20) ఒక విచిత్రమైన కేసు వచ్చింది. 14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. ఈ జంటకు 8నెలల బిడ్డకూడా ఉన్నాడు.. ఈ విచిత్రమైన కేసు విచారణ సమయంలో కోర్టు మానవీయ కోణంలో ఆలోచించింది. జస్టిస్ మన్వేంద్ర మిశ్రా సంచనల తీర్పునిచ్చారు. ముగ్గురు జీవితాలు ఇందుకు ముడిపడి ఉన్నాయి కనుక తాము అది దృష్టిలో పెట్టుకుని తీర్పునిచ్చామని.. ఈ తీర్పుని ఏ రాష్ట్రంలోని కోర్టుని అనుసరించకూడదని స్పష్టం చేసింది.

గత ఏడాది ఫిబ్రవరిలో సరస్వతి పూజకు హాజరైన బాలిక తన ప్రియునితో కలిసి పారిపోయింది.దీంతో బాలిక తండ్రి అదే సమయంలో ఒక బాలునిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాడు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మైనరు జంట తమను విడదీస్తారేమోనని భయపడ్డారు. దీంతో ఢిల్లీకి పారిపోయారు. అక్కడ ఉండే బాలిక అత్త ఇంట్లో ఉన్నారు. అలా కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయ్యింది. నెలలు నిండాక ఒక బిడ్డకు జన్మనిచ్చింది.

ఇటీవలే తన బిడ్డను తీసుకుని ఆ బాలిక సొంత ఊరికి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపధ్యంలో కోర్టు మానవతా దృక్ఫథంతో కూడిన తీర్పునిచ్చింది కేవలం మూడురోజుల్లోనే కోర్టు తీర్పునిచ్చింది. 16 ఏళ్ల బాలిక మరియు 14 ఏళ్ల బాలుడి వివాహం చట్టబద్ధమైన వివాహం అని తేల్చి చెప్పింది. జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్బాయిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది. అలాగే ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉంచాలని..ప్రతీ ఆరు నెలలకు ఈ జంటకు సంబంధించిన రిపోర్టును సమర్పించాలని పోలీసులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ముగ్గురు భార్యలు.. మూడు అస్తిపంజరాలు.. స్టోరీ తెలిస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే..!