అమరావతి భూసేకరణపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం.. అధికార, విపక్షాల మధ్య రాజుకుంటున్న రాజకీయ రగడ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మరావతి అసైన్డ్‌ భూముల కేసులో అధికార,విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

అమరావతి భూసేకరణపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం.. అధికార, విపక్షాల మధ్య రాజుకుంటున్న రాజకీయ రగడ..!
Ap Amaravathi Assigned Lands Controversy
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2021 | 10:53 AM

అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో అధికార,విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరేళ్ల కిందట రాజధాని అమరావతి నిర్మాణం పేరిట జరిగిన భూసేకరణను అధికార వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. అయితే, ఇంతకాం ఏం చేస్తున్నారని…ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చిందన్నది తెలుగు దేశం నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇటు అధికార పార్టీ కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తోంది. మరోవైపు బాధిత రైతులు తమను న్యాయ చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.

కొందరు బడాబాబులు దళితుల భూములు లాక్కుని సమీకరణకు ఇచ్చి మళ్లీ ప్లాట్లు పొందారని, అసైన్డ్‌ చట్టాన్ని ఉల్లంఘించారన్నది ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భూసేకరణ పేరుతో జరిగిన దోపిడీని వెలికి తీయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దానిపై ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. తమ వారి కోసమే అసైన్డ్‌భూములను సమీకరణకు తీసుకోవడానికి ప్రత్యేకంగా జీవో నెంబర్ 41 ఇచ్చారని, కాబట్టి చంద్రబాబు, నారాయణ ఇందులో ప్రధాన సూత్రధారులన్నది ఆర్కే విమర్శించారు.

అయితే, ఎమ్మెల్యే రామకృష్ణ ఆరోపిస్తున్న అంశాలన్నింటికీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది టీడీపీ. దళితుల పేరుతో తప్పుడు కేసులు పెట్టించి… కట్టుకథలు అల్లారన్నది టీడీపీ ఆరోపణ. అంతేకాదు ఆ పార్టీ సీనియర్‌ ధూళ్లిపాళ్ల నరేంద్ర కొన్ని వీడియోలను కూడా చూపించారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై పెట్టిన కేసులో వైసీపీ స్సార్‌సీపీ ప్రభుత్వం కుట్రలు చేసిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఉండటం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇలా అసైన్డ్‌ భూముల కేసు చుట్టూ ఆరోపణలు, కౌంటర్లు కొనసాగుతుంటే… మరోవైపు సీఐడీ తన పని తాను చేసుకుపోతోంది. తుళ్లూరు పీఎస్‌లో రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు అధికారులు. భయపెట్టి అసైన్డ్‌ భూముల కొన్న వారి అంశాలపై ఆరా తీశారు. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం రైతుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు CID అధికారులు. హైకోర్టు నాలుగు వారాల స్టే విధించడం… ప్రాథమిక సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నారు.

Read Also… Tirupati Loksabha by-poll: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి.. ప్రత్యేక వ్యుహంతో టీడీపీ