Srinagar Temperature : జమ్ముకశ్మీర్‌లో ప్రజలను వణికిస్తున్న శీతల పవనాలు.. 30 ఏళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు
జమ్ముకశ్మీర్‌లో శీతల పవనాలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శ్రీనగర్‌లో 30 ఏళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం శ్రీనర్‌లో మైనస్ 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Srinagar Temperature : జమ్ముకశ్మీర్‌లో శీతల పవనాలు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. శ్రీనగర్‌లో 30 ఏళ్లలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం శ్రీనర్‌లో మైనస్ 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి . అయినప్పటికి చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఫేమస్ గుల్‌మార్గ్ టూరిస్టులతో కళకళలాడిపోతోంది.
శ్రీనగర్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు
1995 లో శ్రీనగర్ మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్
1991 లో మైనస్ 11.3 డిగ్రీల సెల్సియస్
ఈ ఏడాది మైనస్ 14.4 డిగ్రీల సెల్సియస్
లోయ ప్రాంతాలు తీవ్రమైన చలితో వణికిపోతున్నాయి. దక్షిణ కశ్మీర్‌లోని వార్షిక అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంప్‌గా పనిచేసే పహల్గామ్ టూరిస్ట్ రిసార్ట్ పరిసరాల్లో మైనస్ 11.1 డిగ్రీల సెల్సియస్ కనిష్టానికి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి మైనస్ 11.7 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
ఇది జమ్ము కశ్మీర్‌లో నమోదైన అతి శీతల ప్రదేశం. గుల్మార్గ్ టూరిస్ట్ రిసార్ట్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడింది. అంతకు ముందు రాత్రి మైనస్ 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయైంది.
లద్దాఖ్‌లో కూడా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుల్‌మార్గ్‌లో కొత్తగా ఏర్పాటు చేసన ఇగ్లూ కేఫ్ టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారింది. ఆసియా ఖండంలో ఇదే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ అని అధికారులు వెల్లడించారు. యూరోపియన్ దేశాలైన ఫిన్లాండ్ , నార్వే , స్విట్జర్లాండ్ దేశాల్లో మాత్రమే ఇలాంటి కేఫ్‌లు ఉన్నాయి.
ఇగ్లూ కేఫ్‌లో ఆతిథ్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. ప్రతి ఒక్కరు ఈ ప్రాంతాన్ని సందర్శించాలని పిలుపునిస్తున్నారు. కశ్మీర్‌లో చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. స్కేటింగ్‌తో పాటు ఇతర మంచు క్రీడలను బాగా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్‌జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్.. Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..