Budget 2021: యూనియన్ బడ్జెట్ యాప్… గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండిలా..

క‌రోనా కార‌ణంగా కేంద్రం ఈసారి బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే బ‌డ్జెట్ కోసం

Budget 2021: యూనియన్ బడ్జెట్ యాప్... గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 6:54 PM

Budget 2021 : క‌రోనా కార‌ణంగా కేంద్రం ఈసారి బడ్జెట్‌ను డిజిటల్ రూపంలో తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే బ‌డ్జెట్ కోసం ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ పేరుతో ఓ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యాప్‌ను కూడా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌, యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ ప్రవేశ‌పెట్టడం పూర్తయిన త‌ర్వాత బడ్జెట్ పూర్తిగా ఈ యాప్‌లో అందుబాటులోకి వస్తుంది. అయితే హల్వా తయారీ సందర్భంగా ఈ యాప్‌ను కేంద్రం ప్రారంభించనుంది.

డిజిటల్‌ ద్వారా అందుబాటులోకి…

యూనియన్ బడ్జెట్ యాప్ ఆండ్రాయిడ్ 5, ఐఓఎస్ 10 పై వెర్షన్లు ఉన్న మొబైల్‌లో ఈ యాప్ ప‌ని చేస్తుంది. నేష‌న‌ల్ ఇన్ఫర్మేటిక్స్ సెంట‌ర్ ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈసారి పార్లమెంట్లోని ఎంపీల‌కు కూడా ఈ బ‌డ్జెట్‌కు సంబంధించిన డిజిట‌ల్ కాపీల‌నే అందించ‌నున్నారు. ఈ యాప్‌లో హిందీ, ఇంగ్లిష్ భాష‌ల‌లో బ‌డ్జెట్ అందుబాటులో ఉంటుంది.

డౌన్లోడ్ ఇలా చేసుకోండి

step 1: గూగుల్ ప్లే స్టోర్‌ను ఓపెన్ చేయండి… step 2: సెర్చ్ బార్‌లో యూనియన్ బడ్జెట్ 2020-21 అని ఎంటర్ చేయండి… step 3: లిస్ట్‌లో చాలా యాప్స్ డిస్‌ప్లే అవుతాయి. వాటిలో ఎన్ఐసీ ఈగవ్ మొబైల్ యాప్స్ పేరుతో థిక్ బ్లూకలర్‌లో భారతీయ రాజముద్రతో యూబీ పేరుతో ఒక యాప్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. step 4: క్లిక్ చేయగానే ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి…. step 5: యాప్ డౌన్‌లోడ్ అయ్యాక ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిని ఓపెన్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. step 6: మొదట యూనియన్ బడ్జెట్ అనే వెల్‌కమ్ పేజీ ఓపెన్ అవుతుంది. step 7: దానిని స్క్రోల్ చేస్తే తర్వాతి పేజీ ఓపెన్ అవుతుంది. అందులో భాష, సంవత్సరం ఆప్షన్లు కనిపిస్తాయి. step 8: భాష, సంవత్సరం ఎంపిక చేసుకున్న తర్వాత బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు వర్గాల వారిగా కనిపిస్తాయి.