PM Narendra Modi: అంతరిక్ష రంగంపై ప్రధాని మోడీ మార్క్.. ప్రపంచ మహాశక్తిగా నిలిపేందుకు కృషి..

PM Narendra Modi: అంతరిక్ష రంగంపై ప్రధాని మోడీ మార్క్.. ప్రపంచ మహాశక్తిగా నిలిపేందుకు కృషి..
Pm Modi

దేశాభివృద్ధితోపాటు అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Shaik Madarsaheb

|

May 25, 2022 | 2:19 PM

8 Years of Modi Government – Space Policy: అంతరిక్షంలో భారత్ మహాశక్తిగా ఎదిగాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యం. ఇప్పటికే అమెరికా, చైనా, రష్యా వంటి దేశాల సరసన భారత్ నిలిచింది. ఈ మేరకు మోడీ సర్కార్.. అంతరిక్ష విధానంలో ఎన్నో సవరణలను తీసుకొచ్చింది. దీంతో భారతదేశ అంతరిక్ష రంగంలో ఆధునిక సాంకేతికలతో పరిశోధనలు ఆవిష్కృతమవుతున్నాయి. దేశాభివృద్ధితోపాటు అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అంతరిక్ష రంగంలో.. అనుకూల వాతావరణం లేని కారణంగా.. యువకులు, ప్రతిభావంతులైన భారతీయ శాస్త్రవేత్తలు.. విదేశాల్లో స్థిరపడేందుకు ఆసక్తి కనబర్చారు. అంతరిక్ష రంగంలో చాలామంది భారతీయులు విదేశాల్లో స్థిరపడడమే ఇందుకు ఉదహరణ. అంతరిక్ష రంగం, ఆధునిక సాంకేతికత రెండూ చాలా దశాబ్దాలుగా తక్కువ ప్రాధాన్యత కలిగిన అంశం. అయితే.. భారతదేశ శాస్త్రవేత్తల విజయాలు సాధించినప్పటికీ భారతదేశ అంతరిక్ష విధానం/కార్యక్రమాల అభివృద్ధి మందగిస్తూ వచ్చింది.

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి మే 26 2022తో 8 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో NDA ప్రభుత్వం అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఘనతలపై టీవీ9 ప్రత్యేక కథనం..

గత రెండు దశాబ్దాలలో స్పేస్‌ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్ గెలాక్టిక్, ఏరియన్‌స్పేస్ వంటి ప్రైవేట్ రంగ సంస్థలు అంతరిక్షం డొమైన్‌కు కొత్త శక్తిని అందించడంతోపాటు మరెన్నో ఆవిష్కరణలను తీసుకువచ్చాయి. ఈ కంపెనీలు ఇతర అంతరిక్ష ప్రయాణ దేశాలలో ఖర్చులు, టర్న్అరౌండ్ సమయాన్ని తగ్గించాయి. మరోవైపు, భారతదేశంలో, ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు.. ప్రభుత్వ అంతరిక్ష కార్యక్రమానికి కేవలం సరఫరాదారులుగా మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ను ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మరింత బలోపేతం చేసేందుకు.. ప్రణాళికలను రచించింది కేంద్ర ప్రభుత్వం..

మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం లాంటి ప్రాముఖ్యతను గ్రహించి దీనిని ఆచరణలో పెట్టారు. ఎందుకంటే ఇది అంతరిక్ష సాంకేతికతను వాణిజ్యీకరించడానికి, అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను పెంచడానికి వీలు కల్పిస్తుంది.

2030 నాటికి గ్లోబల్ స్పేస్ సెక్టార్‌లో 10% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను సాధించాలనే లక్ష్యంతో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం సంస్కరణలను చేపట్టింది.

2007 నుంచి 2013 మధ్య కాలంలో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 31. 2014 నుంచి ఇప్పటి వరకు ఇస్రో 300 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఈ కాలంలో 45 కంటే ఎక్కువ భారతీయ ఉపగ్రహాలు కూడా ప్రయోగించారు. ఫిబ్రవరి 15, 2017న ఇస్రో ఏకంగా 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. అప్పట్లో ఇదో ప్రపంచ రికార్డుగా నిలిచింది.

ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ – ఆథరైజేషన్ సెంటర్

భారతీయ అంతరిక్ష ప్రయత్నాల వాణిజ్యీకరణను మెరుగుపరచడానికి సింగిల్ విండో నోడల్ ఏజెన్సీ, IN-SPACe (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ – ఆథరైజేషన్ సెంటర్) 2020లో ప్రారంభించారు. IN-SPACe ప్రైవేట్ కంపెనీలు కేవలం సరఫరాదారులు లేదా విక్రేతలుగా కాకుండా స్వతంత్ర భాగస్వాములుగా మారడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోదీ ప్రభుత్వం 2020లో అన్ని అంతరిక్ష కార్యకలాపాలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి కూడా అనుమతించింది.

భారతదేశం 350 కంటే ఎక్కువ ప్రైవేట్ అంతరిక్ష సంస్థలను కలిగి ఉంది. US, UK, కెనడా, జర్మనీ తర్వాత భారత్ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది. 2021 నుంచి భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీ ప్రతిపాదనలు 30% పెరిగాయి.

MSMEలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థల నుంచి అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన 40 కంటే ఎక్కువ ప్రతిపాదనలు IN-SPAceకి అందాయి.

స్టార్టప్ ఇండియా పోర్టల్‌లో స్పేస్ టెక్నాలజీ కేటగిరీ కింద దాదాపు 75 స్టార్టప్‌లు నమోదు చేసుకున్నాయి.

ఫిబ్రవరి 2021లో, NSIL తన తొలి వాణిజ్య ప్రయోగాన్ని నిర్వహించింది. ఇది 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది.

ఆరు స్పేస్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ సెంటర్లు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. ఇవి అగర్తల, తిరుచ్చి, జలంధర్, రూర్కెలా, నాగ్‌పూర్, భోపాల్‌లో ఉన్నాయి.

2020లో, భారతదేశంలో స్పేస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు స్పేస్‌కామ్ డొమైన్‌లో పనిచేస్తున్న కంపెనీలకు ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి, డ్రాఫ్ట్ స్పేస్‌కామ్ పాలసీని ప్రారంభించారు.

డిఫెన్స్ మద్దతుతో.. 

డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (DSRO) మద్దతుతో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (DSA), ప్రత్యర్థి అంతరిక్ష సామర్థ్యాన్ని తగ్గించడానికి, అంతరాయాన్ని నిరోధించడానికి, లేదా అంతరాయాన్ని కలిగించడానికి, ఆయుధాలను రూపొందించడానికి ఏర్పాటు చేశారు.

2021లో ప్రధాని మోదీ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA)ని కూడా ప్రారంభించారు. ISpA ద్వారా ప్రధాని మోడీ.. అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి ప్రారంభించారు. ఈ ప్రయత్నాలను పెంచడానికి ISRO – ప్రైవేట్ వాటాదారుల మధ్య సాంకేతిక బదిలీలను సులభతరం చేశారు.

ఈ ప్రభుత్వం అంతరిక్ష సాంకేతికత సరైన వినియోగాన్ని, మెరుగైన అభివృద్ధి ప్రయత్నాలలో సేవలను అందించడంలో పూర్తిగా విజయవంతం అయింది.

స్పేస్ పాలసీ, ప్రోగ్రామ్‌ల డొమైన్‌లో ప్రధాన విజయాలు..

1. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) – NavIC

2. మిషన్ శక్తి (ASAT – the anti satellite weapon)

3. మార్స్ ఆర్బిటర్ మిషన్ (Mars orbiter mission)

4. PSLV-C43 HysIS మిషన్‌ (PSLV-C43 – HysIS mission)

5. కలాం శాట్ (Kalam SAT)

6. GSLV – MKIII ప్రయోగం (GSLV – MKIII)

ఇస్రో చేపట్టబోయో.. క్లిష్టమైన మిషన్లు

1. Gaganyan

2. Chandrayaan – 3

3. NISAR

4. Aditya – L1

5. RISAT – 1A

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu