PM Modi: ఆలోచన.. ఆశయం.. ఆచరణ.. ప్రధాని మోడీ విజయబావుటాలో మైలు రాళ్లుగా నిలిచిన ఆ అష్ట పథకాలు..

గత ఎనిమిదేళ్లలో (8 Years of Modi Government) నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది.

PM Modi: ఆలోచన.. ఆశయం.. ఆచరణ.. ప్రధాని మోడీ విజయబావుటాలో మైలు రాళ్లుగా నిలిచిన ఆ అష్ట పథకాలు..
Modi 2
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 24, 2022 | 1:40 PM

Narendra Modi Government Eight Flagship Schemes: బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం అధికారం చేపట్టి మే 26తో ఎనిమిదేళ్లు పూర్తి కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దేశంలో ఎన్నో సంస్కరణలకు, మరెన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో గతవారం జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఈ నెలతో NDA ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ ఎనిమిదేళ్లు అనేక తీర్మానాలు, విజయాలు సాధించాం.. ఈ ఎనిమిదేళ్లు సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేశాం’’ అని పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్లలో (8 Years of Modi Government) నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత పరంగా అనేక పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కల్పించింది. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన కొన్ని ముఖ్యమైన పథకాలపై టీవీ9 ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది.

ఆయుష్మాన్ భారత్..

ఇవి కూడా చదవండి

ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సెప్టెంబరు 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రాయోజిత ఆరోగ్య సంరక్షణ పథకంగా రూపొందించి అమలు చేశారు. 10.74 కోట్లకు పైగా పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఆరోగ్య రక్షణ కల్పించాలని ఈ పథకాన్ని ప్రారంభించారు. PM-JAY లబ్ధిదారులు భారత జనాభాలో అత్యంత వెనుకబడిన 40% మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి పూర్తిగా నిధులు సమకూరుస్తుండగా, అమలు ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. నగదు రహిత ఆసుపత్రిలో చేరడమే కాకుండా, ఈ పథకం మూడు రోజుల ముందు ఆసుపత్రికి, అదేవిధంగా 15 రోజుల పోస్ట్ ఆసుపత్రికి సంబంధించిన పరీక్షలు, మందుల ఖర్చులను కవర్ చేస్తుంది. PM-JAY సేవల్లో దాదాపు 1,393 విధానాలు ఉన్నాయి. రోగి ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు నుంచి ఈ పథకం కవర్ చేస్తుంది.

గత సంవత్సరం ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన మూడవ వార్షికోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను కూడా ప్రారంభించారు. దీని కింద ఇదివరకే ఆరోగ్య రికార్డులను కలిగి ఉన్న వ్యక్తులకు డిజిటల్ హెల్త్ ID కార్డును అందించనున్నారు. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో బడ్జెట్ అంచనాలు ప్రతి సంవత్సరం రూ. 6,400 కోట్లుగా కేంద్రం ప్రకటించింది. అయితే.. సవరించిన అంచనాలు ప్రకారం వరుసగా రూ. 3,200 కోట్లు, రూ. 3,100 కోట్లు, రూ. 3,199 కోట్లను కేటాయించింది.

కాగా ఈ పథకంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా లేవు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఇటీవల మాట్లాడుతూ.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ప్రభుత్వాలను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని మరోసారి కోరారు.

ఉజ్వల యోజన

ప్రధాని మోడీ 2016లో ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పేరుతో కేంద్రం ఉచిత LPG కనెక్షన్లను పేదలకు అందిస్తోంది. ఈ పథకంతో పేదలు ఇంధన రిటైలర్‌లకు డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఉజ్వల పథకంతో లక్షలాది గృహాలకు వంట గ్యాస్ సిలిండర్‌లను అందించింది. అత్యంత విజయవంతమైన ఈ పథకం ద్వారా దాదాపు 80 మిలియన్ల మహిళలకు లబ్ధి చేకూరింది. 2016లో పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. SC, ST కమ్యూనిటీలతోపాటు మరో ఏడు వర్గాలకు చెందిన మహిళా లబ్ధిదారులను ఈ పథకంలో చేర్చడానికి ఏప్రిల్ 2018లో మార్పులు చేశారు. దీని లక్ష్యం ఎనిమిది కోట్ల ఎల్‌పిజి కనెక్షన్‌లను అందించేలా సవరించారు.

కాగా.. ఆగస్టు 2019లో షెడ్యూల్ కంటే ఏడు నెలల ముందుగానే ఈ లక్ష్యాన్ని కేంద్రం సాధించబడింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించడానికి ఉజ్వల పథకం దోహదపడింది. ఈ పథకంతో ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ చారిత్రాత్మకంగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంగా గత ఏడాది ఆగస్టులో ప్రధాని మోడీ.. ప్రధానమంత్రి ఉజ్వల 2.0 కూడా ప్రారంభించారు. అంతకుముందు PMUY పథకాన్ని పొందని తక్కువ-ఆదాయ కుటుంబాలకు 1 కోటి అదనపు కనెక్షన్‌లను అందించేలా దీనిని ప్రవేశపెట్టారు.

ఉజ్వల పథకంలో భాగంగా.. డిపాజిట్ లేకుండా LPG కనెక్షన్‌తో పాటు, ఉజ్వల 2.0 లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్‌ను ఉచితంగా అందిస్తుంది. నమోదు ప్రక్రియకు కనీస పత్రాలు అవసరం. ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్ కార్డ్‌లు లేదా చిరునామా రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు.

జన్ ధన్ యోజన

వెనుకబడిన వర్గాలకు బ్యాంకింగ్ రంగంపై అవగాహన.. ఆర్ధికంగా చేయూత అందించేందుకు ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని.. 2014 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి చేసిన తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆగస్టు 28న మోడీ ప్రారంభించారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన లక్ష్యం.. బ్యాంక్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా మరియు పెన్షన్‌ల వంటి ఆర్థిక సేవలపై అవగాహన కల్పించడం. దీనిద్వారా సరళమైన విధానంతో ఆర్థిక సేవలు అందించేలా ప్రణాళిక రూపొందించారు.

స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, పెన్షన్‌లు, కోవిడ్ రిలీఫ్ ఫండ్‌లు వంటి ప్రయోజనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జన్ ధన్ ఖాతాలతో సహా బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తారు.

ఈ ఏడాది జనవరి 9 నాటికి జన్ ధన్ పథకం కింద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు రూ.1.5 లక్షల కోట్ల మార్కును దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, డిసెంబర్ 2021 చివరి నాటికి 44.23 కోట్లకు పైగా PMJDY ఖాతాల్లో మొత్తం బ్యాలెన్స్ రూ.1,50,939.36 కోట్లుగా ఉంది.

డేటా ప్రకారం.. మొత్తం 44.23 కోట్ల ఖాతాల్లో 34.9 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, 8.05 కోట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో, మిగిలినవి 1.28 కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. గ్రామీణ – సెమీ అర్బన్ బ్యాంకు శాఖలలో 29.54 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. డిసెంబర్ 29, 2021 నాటికి దాదాపు 24.61 కోట్ల మంది ఖాతాదారులు మహిళలు ఉన్నారు. పథకం మొదటి సంవత్సరంలో 17.90 కోట్ల PMJDY ఖాతాలను తెరిచారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకం ప్రకారం.. జన్ ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 8, 2021 నాటికి, జీరో బ్యాలెన్స్ ఖాతాల మొత్తం సంఖ్య 3.65 కోట్లు. ఇది మొత్తం జన్ ధన్ ఖాతాలలో 8.3% అని ప్రభుత్వం డిసెంబర్, 2021లో పార్లమెంట్‌కు తెలియజేసింది.

కిసాన్ సమ్మాన్ నిధి

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నారు. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో దీనిని కేంద్రం చెల్లిస్తోంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అవుతుంది.

ఈ ఏడాది జనవరి 1న, ఈ పథకం కింద 10వ విడత ఆర్థిక సాయం అందించారు. దేశంలో 10.09 కోట్ల మందికి పైగా రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.20,900 కోట్లకు పైగా విడుదల చేశారు.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఈ పథకం కింద అందించిన మొత్తం నగదు దాదాపు రూ.1.8 లక్షల కోట్లకు చేరుకుంది. PM-KISAN పథకం ఫిబ్రవరి 2019 బడ్జెట్‌లో ప్రకటించారు. మొదటి విడత డిసెంబర్ 2018 నుంచి మార్చి 2019 వరకు అందించింది.

బీమా – పెన్షన్ యోజన

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) 2015లో ప్రారంభించారు. దేశంలో బీమా రంగం స్థాయిని పెంపొందించడానికి, సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేదలకు అణగారిన వారికి బీమా రక్షణను అందించడానికి కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది.

PMJJBY రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీని అందిస్తోంది. అయితే PMSBY ప్రమాదవశాత్తు మరణం లేదా రూ.2 లక్షల శాశ్వత వైకల్య కవరేజీని, రూ.1 లక్ష శాశ్వత పాక్షిక వైకల్య కవరేజీని అందిస్తుంది.

బీమా కంపెనీలు అందించిన డేటాను ఉటంకిస్తూ.. అక్టోబర్ 27, 2021 నాటికి PMJJBY, PMSBY కింద వరుసగా రూ.10,258 కోట్ల 5,12,915 క్లెయిమ్‌లు, అలాగే.. రూ. 1,797 కోట్ల మొత్తంలో 92,266 క్లెయిమ్‌లను పంపిణీ చేశారని ప్రభుత్వం డిసెంబర్ 2021లో పార్లమెంటుకు తెలిపింది.

అటల్ పెన్షన్ యోజన (APY).. అదే సమయంలో ఎంచుకున్న పెన్షన్ మొత్తం ఆధారంగా 60 సంవత్సరాల వయస్సులో రూ.1,000/ రూ. 2,000/ రూ. 3,000/ రూ. 4,000/ రూ. 5,000 హామీతో కూడిన కనీస నెలవారీ పెన్షన్‌ను అందించడం కోసం ప్రవేశపెట్టారు.

ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ. 42 నుంచి ప్రారంభమయ్యే కస్టమర్ సహకారంపై ఆధారపడి రూ.1,000 నుంచి రూ. 5,000 మధ్య నెలవారీ పెన్షన్‌ను అందిస్తుంది. అదనంగా.. చందాదారుడు మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది. చందాదారుడు మరణించిన సందర్భంలో నామినీకి రూ. 8.5 లక్షల వరకు లభిస్తుంది.

APY నిబంధనల ప్రకారం.. 60 సంవత్సరాల వయస్సు నుంచి చందాదారుడు అతని సహకారంపై ఆధారపడి నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 మధ్య కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటారు. అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించబడుతుంది. చందాదారుడు – జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత ఉన్న పెన్షన్ సంపద నామినీకి తిరిగి ఇస్తారు.

అందరికీ హౌసింగ్..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో దీనిని ప్రవేశపెట్టారు. 2022 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 80 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి రూ.48,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. PMAY కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ, పట్టణాలలో ఇళ్లను నిర్మించనున్నారు.

“2022-23లో పిఎం ఆవాస్ యోజనలో గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ – పట్టణ ప్రాంతాలలో 80 లక్షల ఇళ్లు పూర్తవుతాయి. ఇందుకోసం రూ. 48,000 కోట్లు కేటాయించాం’’ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక సర్వే 2022 ప్రకారం.. 2020-21లో 33.99 లక్షల ఇళ్లు, నవంబర్ 25, 2021 నాటికి 26.20 లక్షల యూనిట్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (PMAY-Gmin) కింద పూర్తయ్యాయి.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (PMAY-U) కింద 2021లో 14.56 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని సర్వే పేర్కొంది. 2021-22లో డిసెంబర్ 2021 వరకు 4.49 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి.

స్వచ్ఛ భారత్..

దేశవ్యాప్తంగా బహిరంగ మలవిసర్జన నిర్మూలనకు ప్రతిజ్ఞ చేస్తూ 2014లో ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ను ప్రకటించారు. ఈ మిషన్ కింద ప్రభుత్వం 11.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించింది. 2022-23 బడ్జెట్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కోసం రూ.7,192 కోట్లు కేటాయించగా, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) కోసం 2021-2026లో రూ.1,41,678 కోట్లు ఖర్చు చేస్తారు.

అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చాలని, అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మలవిసర్జన రహితంగా, 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న వాటిని బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం ఉద్దేశ్యంతో స్వచ్ఛ్ భారత్ మిషన్ 2.0 (రెండవ దశను) ప్రధాని మోడీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించారు. తద్వారా పట్టణ ప్రాంతాల్లో సురక్షితమైన పారిశుద్ధ్య ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు.

దీంతోపాటు వ్యర్థాల విభజన చేపట్టారు. అన్ని రకాల ఘన వ్యర్థాలను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయడం, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ కోసం లెగసీ డంప్‌సైట్‌ల నివారణపై మిషన్ దృష్టి సారిస్తుంది.

ముద్రా యోజన

ప్రధాన మంత్రి ముద్రా యోజన (PMMY) అనేది చిన్న పారిశ్రామికవేత్తలకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి), మైక్రోఫైనాన్స్ సంస్థలు దీనిద్వారా రుణాలు ఇస్తున్నాయి. పరిశ్రమలు, అగ్రిగేటర్లు, ఫ్రాంఛైజర్‌లు, అసోసియేషన్‌ల ద్వారా ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ వారిని బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం.

ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద 34.42 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు రూ.18.60 లక్షల కోట్ల రుణాన్ని పొందారని చెప్పారు. 68 శాతానికి పైగా రుణ ఖాతాలు మహిళలకు మంజూరయ్యాయని, పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎలాంటి రుణం పొందని కొత్త పారిశ్రామికవేత్తలకు 22 శాతం రుణాలు మంజూరు చేశామని ఆమె తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..