8 Yrs of Modi Govt: భవిష్యత్తుకు బంగారు బాటలు.. ఏనిమిదేళ్ల మోడీ పాలనలో కీలక నిర్ణయాలు

8 Yrs of Modi Govt: భవిష్యత్తుకు బంగారు బాటలు.. ఏనిమిదేళ్ల మోడీ పాలనలో కీలక నిర్ణయాలు

8 Yrs of Modi Govt: దేశ ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi)8 ఏళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. నిరుపేదలు, రైతులు, ఇతర వర్గాలకు చెందిన వారికి రకరకాల పథకాలను ..

Subhash Goud

|

May 24, 2022 | 1:54 PM

8 Yrs of Modi Govt: దేశ ప్రధాని నరేంద్రమోడీ (Narendra Modi)8 ఏళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు జరిగాయి. నిరుపేదలు, రైతులు, ఇతర వర్గాలకు చెందిన వారికి రకరకాల పథకాలను ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారు ప్రధాని మోడీ. మోడీ ఎనిమిదేళ్ల పాలనలోఎన్నో పథకాలు, నూతన జాతీయ విద్యావిధానం, పెన్షన్‌ పథకాలు, విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా అదుకునేలా మోడీ పాలన కొనసాగింది.

నరేంద్రమోడీ అధికారంలోకి రాకముందు అవినీతి, అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు, తన పట్టులోకి తీసుకువచ్చేందుకు ఆయనకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించిన అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడుతున్నారు.అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పటికీ కోట్లాది మంది భారతీయులు మోడీపై పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారు.

ఆర్టికల్ 370:

జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ కు 70 ఏండ్లలో సాధ్యం కానిది. 70 రోజుల్లో సాధ్యం చేసి చూపించింది మోడీ ప్రభుత్వం. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ను మనదేశం నుంచి వేరుపరించేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే ఈ నిర్ణయం.. జాతీయ సమగ్రతను బలపరిచి, అఖండ భారత్ గా నిలిచేలా చేసింది.

పౌరసత్వ సవరణ చట్టం

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శిలు, క్రైస్తవులు మన దేశానికి శరణార్థులుగా వస్తే వారికి మన పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. పౌరసత్వ సవరణ చట్టంపై భారతీయులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చొరబాట్లను నియంత్రించి, దేశ ప్రజలకు భద్రతను కల్పించేందుకే కేంద్రం ఈ బిల్లును తెచ్చింది.

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ (PM-SYM)

ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ PM-SYM) అసంఘటిత రంగంలోని వారి ఆర్థిక, సామాజిక భద్రత లక్ష్యంగా కేంద్రం ఈ పథకం అందిస్తోంది. అసంఘటిత రంగానికి చెందిన వారు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. రిక్షా తొక్కేవారు, వీధులు ఊడ్చేవారు, ఇటుకలు తయారు చేసేవారు, ఇంట్లో పనులు చేసేవారు, వ్యవసాయ రంగంలోని కూలీలు, నిర్మాణ రంగంలోని కూలీలు, బీడి వర్కర్లు, చేనేత కార్మికులు, తోలు కార్మికులు, కొబ్బరి కాయలు అమ్మేవారు ఇలా అసంఘటిత రంగంలోని ఎవరైనా పీఎం ఎస్‌వైఎం పెన్షన్ స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో లబ్దిదారుడి వయసును బట్టి నెలవారీ రూ. 55 నుండి రూ .200 వరకు డిపాజిట్‌ ఉంటుది. ఈ పథకం కింద నెలవారీ 50% లబ్ధిదారుడు చెల్లిస్తే.. మరో 50% కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.

ఎవరెవరు అర్హులు:

ఈ పథకంలో చేరాలంటే తప్పనిసరిగా భారతీయ పౌరుడిగా ఉండాలి. అసంఘటిత కార్మికులు (హాకర్స్, వ్యవసాయ పని, నిర్మాణ సైట్ కార్మికులు, తోలు కార్మికులు, చేనేత, మధ్యాహ్న భోజన కార్మికులు, రిక్షా లేదా ఆటో వీలర్లు, రాగ్ పిక్కర్లు, వడ్రంగులు, మత్స్యకారులు మొదలైన వారు దీని కిందకు వస్తారు) 18-40 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రూ.15,000/- కంటే తక్కువ నెలవారీ ఆదాయం కలిగి ఉండాలి. EPFO/ESIC/NPS (ప్రభుత్వ నిధులతో) పథకంలో సభ్యత్వం కలిగి ఉండకూడదు.

ప్రయోజనం:

60 ఏళ్లు నిండిన తర్వాత లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ రూ.3000 వరకు అందుకుంటారు. లబ్ధిదారుని మరణం తరువాత జీవిత భాగస్వామికి 50% నెలవారీ పెన్షన్‌ అందిస్తుంది ప్రభుత్వం.అర్హులు. భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే, వారు రూ. 6000/-ఉమ్మడి నెలవారీ పెన్షన్‌కు అర్హులు.

జాతీయ పింఛను పథకం (National Pension Scheme)

దుకాణదారులు, వ్యాపారులు, స్వయం ఉపాధి వ్యక్తుల కోసం జాతీయ పింఛను పథకం(NPS) ప్రవేశపెట్టింది మోడీ ప్రభుత్వం. లబ్ధిదారుని ప్రవేశ వయస్సును బట్టి నెలవారీ డిపాజిట్ రూ .55 నుండి 200 వరకు ఉంటుంది. ఈ పథకం కింద మరో 50% సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇం

ఎవరెవరు అర్హులు:

ఇందులో పింఛన్‌ పొందే వ్యక్తి భారతీయుడై ఉండాలి. చిన్న దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లు లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మొదలైన దుకాణదారులు లేదా యజమానులు అర్హులు. వయసు 18-40 సంవత్సరాలు. EPFO/ESIC/PM-SYM లో చేరి వారు అనర్హులు. వార్షిక టర్నోవర్ రూ .1.5 కోట్లకు మించకూడదు. ఈ పథకం కింద 60 ఏళ్లు నిండిన తర్వాత, లబ్ధిదారులు కనీస భరోసా నెలవారీ పెన్షన్ రూ .3000/-అందుకునేందుకు అర్హులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu