AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: ఎన్నో సంస్కరణలు.. మరెన్నో ఆవిష్కరణలు.. మోడీ సర్కార్ సూపర్ ప్లాన్స్ ఇవే..

8 Yrs of Modi Govt: రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది. ఈ మూడేళ్లలో అనేక సంస్కరణలతో మోడీ సర్కార్ టీమిండియా స్ఫూర్తితో ‘సబ్ కా సాత్,- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ నినాదంతో అభివృద్ధిలో..

PM Narendra Modi: ఎన్నో సంస్కరణలు.. మరెన్నో ఆవిష్కరణలు.. మోడీ సర్కార్ సూపర్ ప్లాన్స్ ఇవే..
Pm Narendra Modi
Sanjay Kasula
|

Updated on: May 25, 2022 | 2:39 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 26 మే 2022 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అలాగే రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్ల అవుతోంది. ఈ మూడేళ్లలో అనేక సంస్కరణలతో మోడీ సర్కార్ టీమిండియా స్ఫూర్తితో ‘సబ్ కా సాత్,- సబ్ కా వికాస్, -సబ్ కా విశ్వాస్’ నినాదంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను సమానదృష్టితో చూస్తూ ఎనలేని అభివృద్ధి ప్రణాళికలను అందిస్తోంది. రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని భావించి ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యల పరిష్కారానికి చోరవ చూపుతున్న ప్రధాని మోడీ.. తన పాలనతో ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. సుపరిపాలన అందిస్తూ సాహసోపేత నిర్ణయాలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు అవినీతి, అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని వేగంగా ప్రక్షాళన చేసేందుకు.. తన పట్టులోకి తీసుకువచ్చేందుకు నరేంద్రుడికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించిన అనేక చర్యలను తీసుకున్నారు. ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని కాపాడి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అయినా తన అభివృద్ధికి అడ్డుకట్ట వేయకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభించిన్నప్పటికీ కోట్లాది మంది భారతీయులు మోడీపై పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారు.

అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేత హిట్‌లు, మిస్‌లను సమీక్షించడానికి ఇది చాలా కాలం సరిపోతుంది. కాబట్టి, ఇప్పటివరకు ప్రధాని మోడీ పదవీకాలాన్ని మనం ఎలా అంచనా వేయాల్సి ఉంటుంది. ఒక స్పష్టమైన మార్గం ఏమిటంటే.. విజయాల జాబితా ద్వారా వీటిలో చాలా వరకు లెక్కించవచ్చు. ఉదాహరణకు ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లలో చేరిన సంఖ్యలు చాలా అసాధారణమైనవి.

జన్ ధన్ యోజన

పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)ను ప్రారంభించారు. అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న భారీ ఆశయంతో ఈ పథకం మొదలైంది.

ముద్రా యోజన –

29 కోట్ల రుణ ఆంక్షలు.. రూ. 15 లక్షల కోట్ల పంపిణీల ద్వారా నిధులు లేని వారికి నిధులు సమకూర్చడం.. తద్వారా వ్యవస్థాపక విప్లవానికి బీజం పడింది. UPI ద్వారా డిజిటలైజ్ చేయని వాటిని – 2020లో 25 బిలియన్ల నిజ-సమయ లావాదేవీలు – తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థగా మార్చింది. మోడీ సర్కార్ వ్యాపారం చేయాలని భావించే వారి కోసం ఈ స్కీమ్‌ను అందుబాటులో తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ 2015 ఏప్రిల్ 8న వ్యాపారులు, ఎంట్రపెన్యూర్ల కోసం ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) స్కీమ్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. వీటిని ముద్రా లోన్స్‌ అని పిలుస్తారు. వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వంటివి ఈ తరహా రుణాలు అందిస్తున్నాయి.

రామ మందిర నిర్మాణం

అయితే.. శతాబ్దాల నిరీక్షణకు ఎండ్ కార్డ్ పడింది. అయోధ్య చరిత్రలోనే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామజన్మభూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది. ధృడమైన ఆత్మవిశ్వాసం, పటిష్టమైన వ్యూహరచన, తగిన సన్నద్ధత, వ్యూహాలను అమలు చేసే చాణక్యం ఉంటే ఎంతటి విషమ పరిస్థితులనైనా అవలీలగా అధిగమించవచ్చని మోడీ ప్రభుత్వం రుజువు చేసింది. భవ్యమైన, దివ్యమైన ఆలయనిర్మానాన్ని ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు.

ఆర్టికల్ 370

ఇక అత్యంత వివాదంగా కొనసాగుతున్న 370 ఆర్టికల్‌కు సెలవు చీటి ఇచ్చింది మోడీ సర్కార్. జమ్ము కశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని చెప్పవచ్చు. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ కు 70 ఏండ్లలో సాధ్యం కానిది, 70 రోజుల్లో సాధ్యం చేసి చూపించింది మోడీ ప్రభుత్వం. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ను మనదేశం నుంచి వేరుపరించేందుకు జరిగిన కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం అనే ఈ నిర్ణయం.. జాతీయ సమగ్రతను బలపరిచి, అఖండ భారత్ గా నిలిచేలా చేసింది.

సీడీఎస్

నవ భారత ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒకే దేశం ఒకే ముఖ్య దళాధిపతి మార్పు దిశగా మరిన్ని అడుగులేసి తీరతామంటూ గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని మోడీ రక్షణ రంగానికి సంబంధించిన త్రివిధ దళాల అధిపతిగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)ను నియమించారు. దేశ రక్షణ దళాలను ప్రపంచంలోనే అత్యుత్తమ దళాల్లో ఒకటిగా నిలిపే ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే కీలకమైన సంస్కరణ.

ఎన్ఎంసీ బిల్లు

ఇన్ స్పెక్టర్ రాజ్ శకానికి చరమగీతం పాడుతూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ స్థానంలో వైద్య రంగంలో ప్రధాని మోడీ నాయకత్వంలో తీసుకువచ్చిన ఎన్ఎంసీ బిల్లు వైద్య, ఆరోగ్యరంగ ప్రక్షాళనలో అతి పెద్ద సంస్కరణ. దీంతో ప్రభుత్వ సీట్లతో పాటు 50 శాతం ప్రైవేట్ సీట్లు కూడా ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.

ఈడబ్యూఎస్

ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) బిల్లు తీసుకువచ్చి ఈ చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.