Priyanka Gandhi Vadra: 21 ఏళ్లకు ప్రేమ.. 44 ఏళ్లకే భర్త మరణం.. తల్లి గురించి ప్రియాంక గాంధీ భావోధ్వేగ ప్రసంగం
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి ప్రపంచానికి తెలియని వాస్తవాలు కోకొల్లలు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ మొదట్లో భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురించి ప్రపంచానికి తెలియని వాస్తవాలు కోకొల్లలు. ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ మొదట్లో భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం (జనవరి 17) ఓ కార్యక్రమంలో వెల్లడించారు. అంతేకాకుండా అప్పట్లో సోనియా గాంధీ రాజకీయాలను పెద్దగా ఇష్టపడలేదని ఆమె తెలిపారు. మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక పీసీసీ ఏర్పాటు చేసిన మహిళా-కేంద్రీకృత సదస్సులో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తూ.. తాను ఇద్దరు ధైర్యవంతుల (తల్లి సోనియా, నానమ్మ ఇందిరా గాంధీ) చేతుల్లో పెరిగాను. నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు ఇంధిరా గాంధీ 33 ఏళ్ల కొడుకును పోగొట్టుకున్నారు. కానీ సంజయ్ గాంధీ మరణించిన మరుసటి రోజే ఆమె దేశానికి సేవలు అందించడానికి విధుల్లోకి వెళ్లారు. కర్తవ్యం పట్ల ఆమె కున్న నిబద్ధత, ఆమె అంతర్గత శక్తి అటువంటిది. ఇందిరా గాంధీ చనిపోయే వరకు దేశానికి సేవ చేస్తూనే ఉన్నారన్నారని గుర్తు చేసుకున్నారు.
తన తల్లి సోనియా గాంధీ గురించి మాట్లాడుతూ.. తన తల్లి 21 ఏళ్లకే రాజీవ్ గాంధీతో ప్రేమలో పడ్డారు. రాజీవ్ గాంధీని వివాహం చేసుకోవడానికి ఇటలీ నుంచి భారత్‌కు వచ్చారు. ఇక్కడి సంప్రదాయాలను నేర్చుకోవడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. ఇందిరా గాంధీ నుంచి సోనియా గాంధీ ఎన్నో ముఖ్య విషయాలను నేర్చుకున్నారు. కేవలం 44 ఏళ్లకే భర్తను కోల్పోయారు. రాజకీయాలు ఇష్టం లేనప్పటికీ, ఆమె దేశానికి సేవ చేయడానికే నిశ్చయించుకున్నారు. తన 76 ఏళ్ల వరకు తన జీవితమంతా దేశ సేవలోనే గడిపిందని’ అని తన తల్లి గురించి ప్రియాంక గాంధీ వాంద్రా వివరించారు. ‘మీ జీవితంలో మీకు ఏమి జరిగినా, ఎంత పెద్ద విషాదాన్ని ఎదుర్కొన్నా, మీకు ఎన్ని కష్టాలు ఉన్నా.. ఇంట్లో లేదా బయట ఎక్కడ ఉన్నా, మీ కోసం నిలబడి పోరాడగల సామర్థ్యం మీకుందని’ ప్రియాంక గాంధీ మహిళలకు స్పూర్తి దాయక సందేశం ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.