ఆదివాసీపై మూత్రవిసర్జన కేసులో ట్విస్ట్.. వేరే వ్యక్తి కాళ్లు కడిగి డ్రామాలాడాడంటూ సీఎం చౌహాన్‌పై విమర్శలు

మధ్యప్రదేశ్‌లోని సిదీలో గిరిజన యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ బాధితుడిని గత గురువారం తన నివాసానికి పిలిపించి..

ఆదివాసీపై మూత్రవిసర్జన కేసులో ట్విస్ట్.. వేరే వ్యక్తి కాళ్లు కడిగి డ్రామాలాడాడంటూ సీఎం చౌహాన్‌పై విమర్శలు
Sidhi Urination Row
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 11, 2023 | 11:05 AM

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిదీలో గిరిజన యువకుడిపై అగ్రవర్ణానికి చెందిన పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్రచర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందిస్తూ బాధితుడిని గత గురువారం తన నివాసానికి పిలిపించి అతని కాళ్లు కడిగి క్షమాపణ కోరారు కూడా. ఐతే ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో సిద్ధి మూత్ర విసర్జన ఘటనపై రాజకీయాలు వాడీవేడీగా చుట్టుముడుతున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కాళ్లు కడిగిన వ్యక్తి అసలు బాధితుడు కాదని, అసలు వ్యక్తి కాళ్లు కడగకుండా సీఎం నాటకాలాడాడంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అంతేకాకుండా సీఎం చౌహాన్‌ కాళ్లు కడిగిన వ్యక్తి, వీడియోలోని వ్యక్తికి చాలా తేడా ఉందని సోషల్‌ మీడియాలో కూడా పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు.

మరోవైపు తాను అసలైన బాధితుడిని కాదని, ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని తాను కాదంటూ సీఎంతో కాళ్లు కడిగించుకున్న దశమత్‌ రావత్‌ కూడా పేర్కొన్నారు. నిందితుడు ప్రవేశ్‌ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్‌ తెలిపాడు. మూత్ర విసర్జన కేసులో వేరొకరి కాళ్లు కడిగి డ్రామా చేసిన సీఎం శివరాజ్ చౌహాన్‌ను ప్రతిపక్షాలతోపాటు పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఐతే బీజేపీ ఈ వాదనను తోసిపుచ్చింది. గిరిజనులు, వెనుకబడిన తరగతులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించింది.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ఈ కేసులో బీజేపీ మరో కొత్తకోణాన్ని వెలుగులోకి తెచ్చింది. సిద్ధి మూత్ర విసర్జన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ పేర్కొనడం గమనార్హం. పైగా ఆ వీడియో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2019-20 నాటిదని ఆయన మీడియా సమక్షంలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.