- Telugu News Photo Gallery Cinema photos These movies are releasing in theaters this week (July 2023)
Telugu Movies: ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలివే! మాస్ యాక్షన్ మువీస్ వచ్చేస్తున్నాయ్
ఈ వారం థియేటర్లు విడుదలయ్యే చిత్రాల లిస్టు వచ్చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబి’ మువీ జులై 14న ప్రేక్షకుల ముందుకు ..
Updated on: Jul 10, 2023 | 11:52 AM

ఈ వారం థియేటర్లు విడుదలయ్యే చిత్రాల లిస్టు వచ్చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబి’ మువీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈతరం యువతను బేబీ మువీ ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది.

శివ కార్తికేయన్ హీరోగా, అదితి శంకర్ హీరోయిన్‌గా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మహావీరుడు’. ఈ సినిమా కూడా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘మామన్నన్’. ఈ మువీ ‘నాయకుడు’ టైటితో తెలుగు ప్రేక్షకుల ముందుకు జులై 14న రానుంది.

దీన్‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'భారతీయన్స్' మువీ జులై 14న థియేటర్‌లో విడుదల కానుంది. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభారంజన్, మహేందర్ బర్గాస్, సమైరా సంధు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ ప్రధానపాత్రల్లో నటించారు.

హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాసిబుల్’ సిరీస్‌తో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమైంది. యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ ఇంపాసిబుల్: డెడ్ రెకనింగ్’ రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్-1 జులై 12 ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.




