- Telugu News Photo Gallery Lip Care Tips in Telugu: How To Take Care of Your Lips Naturally, Know here
Lip Care Tips: పెదాలకు లిప్‌స్టిక్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
అధరాలకు అందాన్నిచ్చే లిప్‌స్టిక్‌ను పెదాలకు అద్దుకుని మురిపిపోతుంటారు మగువలు. ఐతే ఒక్కోసారి లిప్‌స్టిక్ వాడటం వల్ల పెదాలపై చర్మం పొడిబారి అందవిహీనంగా మారిపోతుంటాయి. పెదాలపై పగుళ్లు ఏర్పడి..
Updated on: Jul 10, 2023 | 1:00 PM

అధరాలకు అందాన్నిచ్చే లిప్‌స్టిక్‌ను పెదాలకు అద్దుకుని మురిపిపోతుంటారు మగువలు. ఐతే ఒక్కోసారి లిప్‌స్టిక్ వాడటం వల్ల పెదాలపై చర్మం పొడిబారి అందవిహీనంగా మారిపోతుంటాయి. పెదాలపై పగుళ్లు ఏర్పడి రక్తం కారుతుంటుంది. ఇలాంటివి నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తరచూ లిప్‌స్టిక్ వాడేవారు రోజూ తప్పనిసరిగా కాస్త వెన్న పెదాలకు రుసుకోవాలి. లేదంటే పెట్రోలియం జెల్లీ అయినా రాసుకోవడం అలవాటు చేసుకోవాలి.

తేనె, పంచదార మిశ్రమంతో పెదాలపై మృదువుగా రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటాయి. ఆ తర్వాత లిప్‌స్టిక్ వేస్తే ఎక్కువ సేపు తాజాగా కనిపిస్తాయి.

అలాగే పగిలిన పెదాలకు కొద్దిగా ఆవనూనె తీసుకొని అప్లై చేస్తే పెదవులు కొంత సమయం పాటు మంట పెడతాయి. ఆ తర్వాత పెదాలు తేమ సంతరించుకుని మృదువుగా తయారవుతాయి.

Lip Care




