ఎన్నికల వేళ సిద్ధరామయ్య పుస్తకం చుట్టూ కర్ణాటక రాజకీయం.. ఇంతకీ అందులో ఏముందంటే..?

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ - బీజేపీ మధ్య కొత్త వివాదం చెలరేగింది. కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యపై బీజేపీ రాసిన ‘సిద్దూ నిజకనసుగలు’ అనే పుస్తకం విడుదలపై బెంగళూర్‌ సెషన్స్‌ కోర్టు స్టే విధించింది.

ఎన్నికల వేళ సిద్ధరామయ్య పుస్తకం చుట్టూ కర్ణాటక రాజకీయం.. ఇంతకీ అందులో ఏముందంటే..?
Siddaramaiah
Follow us

|

Updated on: Jan 09, 2023 | 5:49 PM

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ – బీజేపీ మధ్య కొత్త వివాదం చెలరేగింది. కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్దరామయ్యపై బీజేపీ రాసిన ‘సిద్దూ నిజకనసుగలు’ అనే పుస్తకం విడుదలపై బెంగళూర్‌ సెషన్స్‌ కోర్టు స్టే విధించింది. బీజేపీ నేతలు ఈ పుస్తకాన్ని విడుదల చేసేందుకు రెడీ అయిన సమయంలో కోర్టు స్టే విధించడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సిద్దరామయ్య టిప్పు సుల్తాన్‌ లాంటి వాడని, ఆయన సీఎంగా ఉన్నప్పుడు చాలామంది బీజేపీ కార్యకర్తలను హత్య చేయించారని పుస్తకంలో రాశారు. ఈ పుస్తకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దరామయ్య. తనను అప్రతిష్టపాలు చేసేందుకే ఈ పుస్తకాన్ని బీజేపీ రిలీజ్‌ చేయిస్తోందన్నారు. సిద్దరామయ్యకు మద్దతుగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఆయన సామాజిక వర్గానికి చెందిన కురుబ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. బుక్‌ రిలీజ్‌ ఫంక్షన్‌ వేదికను ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదే సమయంలో సిద్ధరామయ్య కొడుకు పుస్తకం రిలీజ్‌పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మాసనం స్టే విధించింది.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనను అవమానించే ఉద్దేశ్యంతో “సిద్దు నిజకనాసుగలు” అనే పేరుతో తన గురించి పుస్తకం రాశారని.. ఈ పుస్తకం తన పరువుకు నష్టం కలిగించేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య పేర్కొన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు శాసనసభ ప్రతిపక్ష నేత వివరించారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోలార్‌ నుంచి పోటీ చేస్తానని సిద్దరామయ్య సోమవారం ప్రకటించారు. టిప్పుతో పోలిన చిత్రాలతో విడుదల చేస్తున్న ఈ పుస్తకం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు.

విశ్వనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఈ పుస్తకంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పాలన, బుజ్జగింపు రాజకీయాలు, ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు. వివాదాస్పద, మతపరమైన సున్నితమైన విషయాల గురించి రాసినట్లు పేర్కొంటున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లలో టిప్పు సుల్తాన్‌ను పోలిన వేషధారణ, కత్తిని పట్టుకుని ఉన్న సిద్ధరామయ్య చిత్రం పుస్తకాల కవర్‌పై ఉండటం మరింత ఆజ్యం పోసింది.

ఇవి కూడా చదవండి

పోస్టర్ ప్రకారం, ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ మంత్రి సిఎన్ అశ్వత్ నారాయణ అధ్యక్షత వహించడంతోపాటు ఆయన పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్సీ చలవాడి నారాయణస్వామి హాజరుకానున్నారు. పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీకి నేతృత్వం వహించిన రచయితగా రోహిత్ చక్రతీర్థ వ్యవహరించగా, జర్నలిస్టు సంతోష్ తమ్మయ్య, విక్రమ సంవాద ఎడిటర్ వృశంక భట్, రచయిత, సామాజిక సేవకుడు రాకేష్ శెట్టి తదితరులు హాజరవుతున్నారంటూ ప్రచారం నిర్వహించారు. కాగా.. దీనిపై కోర్టు స్టే విధించడంతో.. ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..