Delhi Ordinance: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. బీజేపీ వైపే బీజేడీ.. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ప్రకటన..
ఇండియా కూటమిలో బీజేడీ జాయిన్ అవుతుందనుకుంటున్న క్రమంలో.. తాము బీజేపీ వైపునే ఉంటామని నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ స్పష్టంచేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరికించడంతోపాటు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సస్మిత్ పాత్ర మంగళవారం వెల్లడించారు. దీంతో బీజేపీకి ఈ ఆర్డినెన్స్ అడ్డంకులు లేకుండా మరింత సులువుగా గట్టెక్కనుంది.

Biju Janata Dal support Delhi ordinance: ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టింది. రేపు ఈ విషయంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియా కూటమిలో బీజేడీ జాయిన్ అవుతుందనుకుంటున్న క్రమంలో.. తాము బీజేపీ వైపునే ఉంటామని నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ స్పష్టంచేసింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరికించడంతోపాటు.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సస్మిత్ పాత్ర మంగళవారం వెల్లడించారు. దీంతో బీజేపీకి ఈ ఆర్డినెన్స్ అడ్డంకులు లేకుండా మరింత సులువుగా గట్టెక్కనుంది. ఒడిశా అధికార పార్టీ బీజేడీ తీసుకున్న నిర్ణయం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యసభలో సగం మార్కుకు చేరుకోవడంలో సహాయపడుతుంది. ఎగువ సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎకు సొంతంగా పూర్తి మెజారిటీ లేదు.
అయితే, ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్న విపక్షాలకు బిజూ జనతాదళ్ మద్దతు ఇస్తుందని భావించారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి సహకరిస్తుందని అనుకున్నాయి. ఈ తరుణంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సస్మిత్ పాత్ర మంగళవారం మాట్లాడుతూ.. ఢిల్లీ సర్వీసులకు సంబంధించిన బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని, అవిశ్వాస తీర్మానాన్ని కూడా వ్యతిరేకిస్తామని పాత్రా పిటిఐకి తెలిపారు.
26 మంది సభ్యుల ప్రతిపక్ష కూటమి (ఇండియా) కి చెందిన 109 మంది ఎంపీలు, కొంతమంది స్వతంత్రులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఇండియా కూటమి నేత ఒకరు చెప్పారు. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ఉన్న మొత్తం 238 మంది సభ్యులు ఆ రోజు ఓటు వేస్తే ఇది 120 సగం మార్కు కంటే తక్కువగా ఉంటుంది. సభ పూర్తి బలం 243 అయితే.. కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి.




విపక్షాల సమూహంలోని 26 పార్టీలలో కనీసం 18 పార్టీలు రాజ్యసభలో ఉనికిని కలిగి ఉన్నాయి. 101 మంది ఎంపీల సంఖ్యా బలం ఉంది. ఈ కూటమితో పాటు, BRS (ఏడు మంది ఎంపీలు) కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే YSR కాంగ్రెస్ (తొమ్మిది మంది ఎంపీలు) బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ ఆర్డినెన్స్ కు సంబంధించి పార్టీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
అధికార NDA ఎగువ సభలో 100 మంది ఎంపీలను కలిగి ఉండగా, నామినేటెడ్ సభ్యులు, స్వతంత్రులు, భాగస్వామ్య పక్షాలు అనుకూలంగా ఓటు వేయనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
