PM Modi: స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే.. చివరికి అదే జరుగుతుంది.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రాల నిధులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అయినా కూడా.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే.. రాష్ట్ర ప్రజలే ఆ భారాన్ని భరించాల్సి వస్తుందని అన్నారు. విదేశి వలసవాదులు పెట్టినటువంటి పేర్లను మారుస్తుంటే కొంతమంది మాత్రం చాలా ఇబ్బందిగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. పరస్పరంగా విశ్వాసం లేని చోట అభివృద్ధి జరగడం సాధ్యం కాదని తెలిపారు.

రాష్ట్రాల నిధులపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అయినా కూడా.. తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తే.. రాష్ట్ర ప్రజలే ఆ భారాన్ని భరించాల్సి వస్తుందని అన్నారు. విదేశి వలసవాదులు పెట్టినటువంటి పేర్లను మారుస్తుంటే కొంతమంది మాత్రం చాలా ఇబ్బందిగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. పరస్పరంగా విశ్వాసం లేని చోట అభివృద్ధి జరగడం సాధ్యం కాదని తెలిపారు. పుణె పర్యటనలో ప్రధాని లోకమన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కర్ణాటక, రాజస్థాన్‌లలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఒకవైపు పుణె వేగంగా అభివృద్ధి చెందుతుండగా.. మరోవైపు బెంగళూరులో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తామని అన్నారు. బెంగళూరులోతో సహా రాష్ట్ర అభివృద్ధికి నిధులు లేవని స్వయంగా కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని వ్యాఖ్యానించారు.
కర్ణాటకలో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని.. అక్కడ కూడా అప్పులు పెరిగిపోయి అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. ఓ పార్టీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర నిధులను మొత్తం ఖాళీ చేస్తే ఆ భారం ప్రజలపైనే పడుతుందని పేర్కొన్నారు. కర్ణాటక, రాజస్థాన్.. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా లోకమన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరించిన నేపథ్యంలో ప్రధాని.. మీడియా స్వేచ్ఛ ప్రాధాన్యాన్ని తిలక్ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటం చేసేటప్పుడు పంథాను మార్చారని తెలిపారు. మరోవైపు ఇదే వేదికపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా మాట్లాడారు. భారత్‌లో తొలి సర్జికల్ స్ట్రైక్ ఛత్రపతి శివాజీ హాయంలో జరిగిందని చెప్పారు. శివాజీ మహారాజ్ ఎప్పుడూ కూడా ఎవరి భూమిని లాక్కోలేదని అన్నారు. స్వాతంత్ర్య పొరాట సమరంలో రెండు శకాలున్నాయన్నారు. ఒకటి తిలక్ శకం కాగా.. మరొకటి మహాత్మ గాంధీ శకమని అన్నారు. మరో విషయం ఏంటంటే ఎన్సీపీలో చీలిక జరిగిన తర్వాత.. శరద్ పవార్, ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే మొదటిసారి.




మరిన్ని జాతీయ వార్తల కోసం..
