Section 144 Noida: అక్కడ 144 సెక్షన్ విధింపు.. మార్చి 17 నుంచి ఏప్రిల్ 30 వరకు అమలులో..
Section 144 Noida: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. గతంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది...
Section 144 Noida: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగిపోతోంది. గతంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా.. మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. రంగంలోకి దిగిన అధికారులు పలు రాష్ట్రాల్లో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేస్తున్నారు. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెక్షన్ 144 విధించారు. ఈ సెక్షన్ మార్చి 17 నుంచి ఏప్రిల్ 30 వరకు అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. అటు కరోనా కేసులు పెరగడం, పండగ సీజన్‌లో శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నాలకు అవకాశాలు ఉండటంతో ఈ ఆంక్షలు విధిస్తున్నారు. రానున్న పండల సీజన్‌లలో ఈ సెక్షన్ అమల్లో ఉంటుంది.
హోళీ, గుడ్‌ప్రైడే, నవరాత్రి, అంబేద్కర్ జయంతి, రామనవమి, మహావీర్ జయంతి, హనుమాన్ జయంతి తదితర ఉత్సవాలతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది.ఇక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు చేపట్టనున్నారు.ఈ పండగల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున ఈ 144 సెక్షన్ విధించామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు అశుతోష్ ద్వివేది జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సెక్షన్‌లో భాగంగా ప్రజలు కరోనాను కట్టడికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో సామూహిక సమావేశాలకు ఎలాంటి అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం, వివాహాలు, ఇతర శుభకార్యాలకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు.
కాగా, దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాబోయే పండగ సీజన్ కాబట్టి కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావించి నిబంధనలు మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. నిబంధనలు సరిగ్గా పాటించకపోవడంతో కోవిడ్ మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
आगामी चुनाव/त्योहारों के दृष्टिगत जनपद गौतमबुद्धनगर में दिनांक 17.03.2021 से 30.04.2021 तक निषेधाज्ञा अंतर्गत धारा-144 दंड प्रक्रिया संहिता लागू।@Uppolice pic.twitter.com/15BfbpGUVF
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) March 17, 2021
ఇవీ చదవండి : మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. గత 24గంటల్లో 23 వేలకు పైగా కేసులు.. ఎంతమంది మరణించారంటే?