Covid Drug 2-DG: కోవిడ్ బాధితులకు శుభవార్త.. నేడే 2-DG డ్రగ్ సెకండ్ బ్యాచ్ విడుదల.. డ్రగ్ పనితీరుపై భారీ అంచనాలు
Anti-Covid Drug 2-DG: కరోనా మహమ్మారి విరుగుడుకు తయారు చేసిన 2 డీజీ డ్రగ్ నేడు మార్కెట్లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్..
Anti-Covid Drug 2-DG: కరోనా మహమ్మారి విరుగుడుకు తయారు చేసిన 2 డీజీ డ్రగ్ నేడు మార్కెట్లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. అయితే కోవిడ్ బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీని పనితీరుపై భారీ అంచనాలే ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఈ డ్రగ్ అందుబాటులోకి రానుంది. కోవిడ్ పోరుకు డీఆర్‌డీవో డెవలప్ చేసిన యాంటీ కోవిడ్ డ్రగ్2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ). పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్‌డీవో వివరించింది. మార్కెట్లోకి 10వేల సాచెట్లను విడుదల చేస్తున్నారు.
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ డ్రగ్స్‌ను తయారు చేసింది. కరోనా రోగుల ఎమర్జెన్సీ వాడకానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. కరోనా రోగులపై ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో స్పష్టమైంది. తెలంగాణలో ఈ 2డీజీ ఔషధం జూన్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Also Read: Covid-19 India: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24గంటల్లో ఎన్ని మరణాలు నమోదయ్యాయంటే..?